'మిస్టర్ మజ్ను'.. అఖిల్ ప్లేబాయ్ అవతారం!

Published : Sep 19, 2018, 04:52 PM IST
'మిస్టర్ మజ్ను'.. అఖిల్ ప్లేబాయ్ అవతారం!

సారాంశం

అక్కినేని అఖిల్ హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన 'హలో' సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. దీంతో తన మూడో సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు అఖిల్.

ఈ క్రమంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టనున్నారనే విషయంలో మజ్ను అనే పేరు బాగా వినిపించింది. ఇప్పటికే ఈ టైటిల్ తో రెండు సినిమాలు రావడంతో మళ్లీ పెట్టరేమోనని అనుకున్నారు.

కానీ ఇదే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ చిత్రబృందం టైటిల్ లోగో టీజర్ ని విడుదల చేసింది. ''దేవదాసు మనవడో.. మన్మధుడికి వారసుడో.. కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో..'' అనే పాటతో టీజర్ మొదలైంది.

ఇందులో అఖిల్ ఓ అమ్మాయిని మిస్ అని పిలుస్తూ.. 'ఏమిటో ఈ ఇంగ్లీష్ భాష దేన్నైతే మిస్ చేయకూడదో.. దాన్నే మిస్ అన్నారు'' అనే డైలాగ్ అతడి క్యారెక్టర్ ఎలా వుండబోతుందనే విషయాన్ని చెబుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్