అవార్డుల‌తో అద‌ర‌గొట్టిన పెళ్లిచూపులు

Published : Apr 08, 2017, 05:22 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అవార్డుల‌తో అద‌ర‌గొట్టిన పెళ్లిచూపులు

సారాంశం

పెళ్లి చూపులు సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్స్‌ శ‌త‌మానంభ‌వ‌తి, జ‌న‌తా గ్యారేజ్ కు సైతం అవార్డులు ఆనందంలో తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌  

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయింది.  కొత్త హీరోలు, దర్శకుల, నిర్మాతలు తమ సత్తా చాటుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘పెళ్లి చూపులు’.  తాజాగా వెల్లడించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో "పెళ్లి చూపులు" చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.
         
2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. జనతా గ్యారేజ్ సినిమాకు ఒక అవార్డు, పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కడం విశేషం. శతమాణం భవతి కూడా ఉత్తమ ప్రజాదరన పొందిన చిత్రం గా అవార్డు కొట్టింది. , పెళ్ళి చూపులు  ఇంత స్థాయిలో విజయ పతాక ఎగరేస్తుందని మాత్రం ఊహించలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సినిమా పెళ్లి చూపులు.

 ఎప్పటిలాగే మన దక్షిణాది సినిమా రంగానికి చెందిన ఏ హీరోకి ఈ నేషనల్ అవార్డ్స్ లో స్థానం లభించలేదు. అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడానికి విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ కనీసం వచ్చే సంవత్సరం అయినా ఎన్ని అవార్డులు తెచ్చి పెడుతుందో చూడాలి.. 
 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌