ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెళ్లుచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ క్షమాపణలు

Published : May 06, 2017, 07:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెళ్లుచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ క్షమాపణలు

సారాంశం

జనతా గ్యారేజ్ కు ఐఫా అవార్డులపై  పెళ్లిచూపులు దర్శకుడు చేసిన కమెంట్స్ వివాదాస్పదం సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమెంట్స్ తను ఎవరినీ కించపరచలేదని, సారీ చెప్పటానికి రెడీ అన్న తరుణ్ భాస్కర్

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కు నెటిజన్ల నుంచి... ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శల తాకిడి ఎక్కువైంది. తనకు అవసరం లేని వివాదాన్ని మెడకు చుట్టుకున్నట్లు తయారైంది ప్రస్థుతం తరుణ్ భాస్కర్ పరిస్థితి.

 

ఇటీవల జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకల్లో పెళ్లి చూపులు సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై తరుణ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం టీఆర్పీల కోసమే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాకు అవార్డులిస్తున్నామని, వేరే సినిమాలకు అవార్డులు ఇస్తే టీఆర్పీ రేటింగులు పెద్దగా రావని భావించటం వల్లే అలా ఎన్టీఆర్ చిత్రానికి అవార్డులు ఇస్తున్నామని తనతో కమిటీ వారు అన్నట్లుగా తరుణ్ భాస్కర్ చేసిన కమెంట్స్ నేపథ్యంలో ఆయనపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

అయితే.. ఎన్టీఆర్ ను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. తనకు ఇసలు ఇండస్ట్రీ కొత్త అని.. పరిశ్రమలో ఉన్న వాళ్లందరి పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని తరుణ్ భాస్కర్ స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ ను కించపరిచేవిధంగా తాను ఏమీ మాట్లాడలేదని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న కమెంట్స్ చూసి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారని అన్నాడు. తను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని, అలాంటి ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. అవసరమైతే మీడియా సమావేశం నిర్వహించి మరీ తను ఎన్టీఆర్ వివాదంపై స్పష్టత ఇస్తానని చెప్పాడు తరుణ్ భాస్కర్.

PREV
click me!

Recommended Stories

Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ