ఎన్టీఆర్‌ను సపోర్ట్‌ చేసానని బెదిరింపులు, ఏడ్చేసా!

By Surya PrakashFirst Published Jun 30, 2020, 10:29 AM IST
Highlights

ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్  ఆత్మహత్యకు పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు హీరోయిన్స్ ఈ అంశంపై నోరువిప్పి సినీ పరిశ్రమలో జరుగుతున్న వ్యవహారాలు, రహస్యాలు బయటపెట్టేస్తున్నారు. ప్రతి ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరో ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు తనని బెదిరిస్తున్నారని నటి పాయల్‌ ఘోష్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. సినీ పరిశ్రమలో నెపోటిజం (బంధు ప్రీతి) అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్రస్దాయిలో చర్చ జరుగుతున్న  సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు హీరోయిన్స్ ఈ అంశంపై నోరువిప్పి సినీ పరిశ్రమలో జరుగుతున్న వ్యవహారాలు, రహస్యాలు బయటపెట్టేస్తున్నారు. ప్రతిబ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తారక్ కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దాంతో  తాను డైరెక్ట్‌ మెస్సేజ్‌ ఆప్షన్‌ తొలగించినట్లు తెలిపారు. ఇటీవల తాను బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం గురించి మాట్లాడితే, తారక్‌ కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారని తనకు సందేశాలు పంపుతున్నట్లు వాపోయారు. అయితే, సినిమా కోసం ఎన్టీఆర్ పడే కష్టం ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

‘‘నన్ను బెదిరించడం కొంతమందికి ఒక క్రేజ్‌లా ఉంది.  నేను తారక్‌కు మద్దతుగా నిలబడటం వెనుక అసలు కారణం మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆయన పట్ల కాస్త జాలి చూపండి. ఆయన గతం గురించి తెలిసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏడ్చేశాను. ఇక చాలు ఆపండి. ఎన్టీఆర్‌ను చూసి గర్వపడండి’’ అంటూ పాయల్‌ ట్వీట్‌ చేశారు.

తాను ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నానన్న పాయల్‌.. దయ చేసి సోషల్ మీడియా వేదికగా తనని తిట్టడం ఆపాలని కోరారు. తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ తదితర చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు.

click me!