‘హిరణ్యకశ్యప’ బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్, సురేష్ బాబు వివరణ

By Surya PrakashFirst Published Jun 30, 2020, 10:28 AM IST
Highlights

సురేష్ బాబు నిర్మించతలపెట్టిన  ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్టులపై రోజుకో వార్త వినపడుతోంది. కొద్ది రోజుల ఈ సినిమా ఇక తియ్యరని, మరికొద్దిరోజులు బడ్జెట్ అంత పెట్టరని, స్క్రిప్టుని బడ్జెట్ తగ్గింపు దిసగా తిరగ రాయిస్తున్నారని రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే అందులో నిజమెంత సురేష్ బాబు మనస్సులో ఏముంది...అనే విషయమై ఓ మీడియా సంస్దతో ఆయన మాట్లాడారు.

కరోనా ప్రభావంతో థియోటర్స్ మూత పడ్డాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. నిర్మాతలు బడ్జెట్ లు తగ్గించుకుంటున్నారు. పెద్ద ప్రాజెక్టులపై ఆసక్తి చూపటం లేదు. ఈ నేపధ్యంలో సురేష్ బాబు నిర్మించతలపెట్టిన  ‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్టులపై రోజుకో వార్త వినపడుతోంది. కొద్ది రోజుల ఈ సినిమా ఇక తియ్యరని, మరికొద్దిరోజులు బడ్జెట్ అంత పెట్టరని, స్క్రిప్టుని బడ్జెట్ తగ్గింపు దిసగా తిరగ రాయిస్తున్నారని రకరకాల వార్తలు వినపడ్డాయి. అయితే అందులో నిజమెంత సురేష్ బాబు మనస్సులో ఏముంది...అనే విషయమై ఓ మీడియా సంస్దతో ఆయన మాట్లాడారు.

సురేష్ బాబు మాట్లాడుతూ...“కొన్ని కథలను లావిష్ గానే చెప్పాలి. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు.  ‘హిరణ్యకశ్యప’ అలాంటిదే. ఈ కథను హై స్టాండర్డ్స్ లోనే చెప్పాలి. మనం కనుక కాంప్రమైజ్ అయితే ఆడియన్స్ థియోటర్స్ కు రారు. ఇక కరోనా వచ్చిందని బడ్జెట్ ని తగ్గించదలుచుకోలేదు. మొదట అనుకున్న బడ్జెట్ తోనే ముందుకు వెళ్తాము.” అంటూ క్లారిటీ ఇచ్చేసారు.
 
ఇక అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై పనిచేస్తున్న గుణ శేఖర్ కు రానా ఓ కండీషన్ పెట్టారట. దానికి మారు మాట్లాడకుండా ఓకే అనేసారట గుణ శేఖర్.

అదేమిటంటే...ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట. ఈ సినిమాకు కీలకమైన విఎఫ్ ఎక్స్ విషయంలో రానా చూపిన శ్రద్దకు మురిసిపోయిన గుణశేఖర్...వెంటనే ఆ ప్రపోజల్ కు ఓకే చెప్పేసారట. దాంతో బాహుబలికు పనిచేసిన విఎప్ ఎక్స్ డైరక్టర్ కమల్ కన్నన్ ని పిలిచి భాధ్యతలు అప్పగించారని సమాచారం. ప్రస్తుతం రానా చేస్తున్న విరాట పర్వం పూర్తవగానే ఈ సినిమా షూట్ మొదలుకానుంది.  

‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్.  టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో ఇప్పటికే రానా  ప్రత్యేక కసరత్తు చేస్తున్నారట. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి వి.ఎఫ్.ఎక్స్ డైరక్టర్ తో  గుణశేఖర్ చర్చలు జరిపి అన్ని విధాలుగా రెడీ చేసారట. 

click me!