రోహిత్ వేముల ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్

Published : Dec 16, 2016, 10:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
రోహిత్ వేముల ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్

సారాంశం

రోహిత్ వేముల ఘటనపై స్పందింంచిన పవన్ కళ్యాణ్ హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ దేశవ్యాప్తంగా సంతలనం సృష్టించిన రోహిత్ ఘటన

రోహిత్ వేముల ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు కావాలి తప్ప, రాజకీయ పార్టీలకు యుద్ధక్షేత్రాలు కాకూడదని, ఆ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. రోహిత్ ఆక్రోశంపై ముందుగానే స్పందించి కౌన్సెలింగ్ ఇప్పించి ఉంటే అతడు ఆత్మహత్య చేసుకునేవాడు కాడని చెప్పారు. ట్విట్టర్ ఖాతాలో స్పందించిన పవన్ తన వరుస ట్వీట్లలో తీవ్రంగానే స్పందించారు. 

 

చాలా లక్షల మంది ప్రజల్లాగే రోహిత్ వేముల కూడా బీజేపీని ద్వేషించాడనడంలో అనుమానం లేదని పవన్ చెప్పారు. కానీ అంతమాత్రాన తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను వేధించడానికి వారికి లైసెన్సు ఏమీ లేదన్నారు. పైగా అతడు ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నప్పుడు అలా చేయడం సరికాదన్నారు. ఇది కేవలం బీజేపీకి మాత్రమే కాదని.. అన్ని పార్టీలు, గ్రూపులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. యూనివర్సిటీలోని తన ప్రత్యర్థి గ్రూపులతో కాషాయీకరణ గురించిరోహిత్ చెప్పినా, కేంద్రం దాన్ని కేవలం విద్యార్థుల మధ్య సిద్ధాంతపరమైన విభేదంగానే చూసి ఉండాల్సిందని అన్నారు. వాళ్ల గొడవవల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి ఉంటే అప్పుడు సంబంధిత అధికారులను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పి ఉండొచ్చని పవన్ అన్నారు. కానీ, కేంద్రం ఈ విషయాన్ని వ్యక్తిగత అంశంగా తీసుకుందని, అందుకు కారణాలేంటో తెలియదని తెలిపారు. తనను సస్పెండ చేయడం, క్యాంపస్ నుంచి వెలివేయడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, తన సొంత వర్గం నుంచి కూడా ఆశించినంత నైతిక మద్దతు లభించకపోవడం వల్ల అలా జరిగిందని అన్నారు.

 

మానవీయ కోణంలో అతడికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడినట్లు అయ్యేదని చెప్పారు. ఇందులో మరో విషాదకరమైన కోణం కూడా ఉందని.. బీజేపీయేతర పార్టీలన్నీ ఈ ఘటన నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించాయని, ఇక బీజేపీ అనుబంధ పక్షాలైతే అతడు దళితుడు కాడన్న విషయాన్ని నిరూపించడంలో బిజీ అయిపోయాయని విమర్శించారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ కూడా భవిష్యత్తులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో అనే విషయానికి సమాధానం వెతికే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్