#HHVM:‘హరిహర వీరమల్లు’టీజర్ రిలీజ్ డేట్ , ఆ షాట్స్ తోనే టీజర్

By Surya PrakashFirst Published Jan 2, 2023, 7:46 AM IST
Highlights

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఏక కాలంలో విడుదల కానుందీ చిత్రం.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో  ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత ఏఎం రత్నం ఓ హింట్‌ ఇచ్చాడు.

హరి హర వీర మల్లు టీజర్‌ జనవరి 26న రిలీజ్ చేసే అవకాశం ఉన్నదని  ఆయన చెప్పారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఈ టీజర్ లో ... నలభై రోజులు పాటు షూట్ చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్  లోని కొన్ని షాట్స్ చూపనున్నారు. పవన్  సినిమాల కంటే రాజకీయాల్లో బిజీ కావడం, హరి హర వీర మల్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి రావడంతో షూటింగ్‌ చాలా ఆలస్యమైంది.  ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకుని చాలా కాలం అయినప్పటికీ, పవన్ రాజకీయ వ్యవహారాల వల్ల సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది.  రీసెంట్ గా పవన్ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం భారీగా కసరత్తు చేసి మరీ చేసారు. రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన ఆ సీన్స్ సినిమాకు హైలెట్ అంటున్నారు.

సుమారు 20 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించినట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రముఖ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. కీలకమైన షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్‌ను రూపొందించారు. పవన్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. ఇందులో పవన్‌ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. 
 

click me!