2022 జీవితంలో మర్చిపోలేను, ఎన్నో సాధించానన్న నయనతార భర్త, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేష్

Published : Jan 01, 2023, 10:56 PM ISTUpdated : Jan 01, 2023, 10:58 PM IST
2022 జీవితంలో మర్చిపోలేను, ఎన్నో సాధించానన్న నయనతార భర్త,  ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేష్

సారాంశం

తన జీవితంలో మర్చిపోలేని ఏడాది 2022 అన్నారు నయనతార భర్త..కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఎమోషనల్ ట్వీట్ ద్వారా తన మనసులో మాట బయట పెట్టారు.   

ఈ ఏడాది కాసిన్ని చిక్కులు వచ్చినా.. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఏడాది అంటున్నాడు నయనతార భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్.  ఈ ఏడాది తనకు చాలా దక్కాయన్నారు. నయనతారతో పెళ్లి, రజనీకాంత్ ఆశీస్సులతో పాటు.. ఇద్దరు కవల పిల్లలు తన జీవితంలోకి రావడం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవం దక్కడంతోపాటు.. లైకాతో సినిమాఫిక్స్ అవ్వడం.. ఇలా తన జీవితంలో మిరాకిల్స్ అన్నీ 2022లోనే జరిగాయన్నారు. 

విఘ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 2016 నుంచి నయనతారతో ప్రేమలో ఉన్నాడు. అప్పటి నుంచి సహజీవినం కూడా చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జూన్ లో ఈ జంట పెళ్ళిబంధంతో ఒక్కటి అయ్యారు. ఆరువాత నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసిద్వారా తల్లి తండ్రులు కూడా అయ్యారు. ఈ విషయంలో వివాదాలు కూడా ఫేస్ చేశారు ఈజంట. ఇక తమ అన్నోన్య జీవితాన్ని గడుపుతున్నారు. 

 

పెళ్ళి తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు ఈ జంట. వాటికి అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ.. ఫారెన్ టూర్లు వేస్తూ.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యయాపీగా గడిపేస్తున్నారు. విజయ్ సుతుపతి, నయనతార జంటగా నటించి నానుమ్ రౌడీ దాన్  సినిమాను విఘ్నేష్  శివన్ దర్శకుడిగా మారాడు. ఈసినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రమచిగురించింది. ఆతరువాత దాదాపు ఐదారేళ్లు ప్రేమలో మునిగి తేలారు తమిళజంట. 
 

ఇక 2022 కు హ్యాపీగా గుడ్ బై చెప్పారు విఘ్నేష్. 2023కి అంతకంటే ఎక్కువ సంతోషంతో వెల్కం చెప్పారు. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ సంతోషలతో జీవితం సాఫీగా సాగిపోవాలనికోరకున్నారు విఘ్నేష్. నయన్ తో తన లైఫ్ హ్యాపీగా ఉండాలన్నారు.  విఘ్నేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ఈ పోస్ట్ కు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్