pawan Kalyan:ఏపీ ప్రభుత్వానికి,మిగతా హీరోలకు పవన్ కళ్యాణ్ చురకలు,షాకింగ్ కామెంట్

Surya Prakash   | Asianet News
Published : Feb 25, 2022, 05:04 AM IST
pawan Kalyan:ఏపీ ప్రభుత్వానికి,మిగతా హీరోలకు పవన్ కళ్యాణ్ చురకలు,షాకింగ్ కామెంట్

సారాంశం

 ఈ మొత్తం వివాదం (టికెట్ రేట్ల తగ్గింపు) పవన్ కళ్యాణ్ ని కట్టడి చేసేందుకే జగన్ ప్రభుత్వం చేసిందని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. అయినా, అదే పద్దతిలో వెళ్తోంది వైఎస్సార్సీ గవర్నమెంట్.


‘భీమ్లా నాయక్’ సినిమాకి ఎటువంటి బెనిఫిట్స్ దక్కకూడదని జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ సినిమాని గవర్నమెంట్ రేట్లకే టికెట్ రేట్లు అమ్మాలని, ఎక్స్ట్రా షోలు వెయ్యొద్దు అని రెవెన్యూ శాఖ సిబ్బంది థియేటర్లకు ఫోన్ చెప్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్స్ , లోకల్ అధికారులు  ఇప్పటికే   థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం అయ్యి,హెచ్చరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. బెనిఫిట్ షోలు వేసినా, టికెట్ రేట్లు పెంచినా థియేటర్లని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

 ఈ మొత్తం వివాదం (టికెట్ రేట్ల తగ్గింపు) పవన్ కళ్యాణ్ ని కట్టడి చేసేందుకే జగన్ ప్రభుత్వం చేసిందని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. అయినా, అదే పద్దతిలో వెళ్తోంది వైఎస్సార్సీ గవర్నమెంట్. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ మిగతా హీరోలు ఎవరూ కూడా ఈ ఇష్యూపై మాట్లాడకుండా ఉండటాన్ని ఇండైరక్ట్ గా సెటైర్ చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని నాజీ ప్రభుత్వంతో పోలుస్తూ ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ మీరే చూడండి.

ఇదిలా ఉంటే సినిమా థియేటర్‌ యజమానులను బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆరోపించింది. ‘భీమ్లానాయక్‌’ విడుదల కానున్న నేపథ్యంలో రద్దైన జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయించాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, నిర్మాత నట్టి కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన జీవో ప్రకారం టికెట్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

ఈ విషయంలో పలువురు రాజకీయ నాయకులు కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని రద్దైన జీవో 35 కంటే ముందున్న జీవో 100 ప్రకారమే టికెట్‌ ధరలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నటీనటులకు వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా.. సినిమా వరకు వచ్చే సరికి సినిమానే ప్రాధాన్యత ఉంటుందని ప్రసన్నకుమార్‌ తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం