ట్రెండింగ్‌లో `డిజాస్టర్‌ వకీల్‌సాబ్‌`.. జగన్‌తో పెట్టుకుంటే.. ?

Published : Apr 09, 2021, 04:05 PM IST
ట్రెండింగ్‌లో `డిజాస్టర్‌ వకీల్‌సాబ్‌`.. జగన్‌తో పెట్టుకుంటే.. ?

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` సినిమా ఓ వైపు బ్లాక్‌ బస్టర్‌ అనే ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది. మరోవైపు `డిజాస్టర్‌వకీల్‌సాబ్‌` అనే యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. దీంతో ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` సినిమా ఓ వైపు బ్లాక్‌ బస్టర్‌ అనే ఫ్యాన్స్ నుంచి వినిపిస్తుంది. మరోవైపు `డిజాస్టర్‌వకీల్‌సాబ్‌` అనే యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. దీంతో ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పవన్‌ రీఎంట్రీ చిత్రం `వకీల్‌సాబ్‌`కి మొదట బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత యావరేజ్‌ అనే టాక్‌ ఊపందుకుంది. ఇప్పుడు ఓ వైపు డిజాస్టర్‌ అనే టాక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

సినిమా పరంగా గొప్పగా ఏం లేదనే టాక్‌ వినిపిస్తూనే మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి సమాజంలో ఉన్న చిన్నచూపుని, మహిళలపై వేధింపులను ఈ సినిమా కోర్ట్ రూమ్‌ వేదికగా చర్చించింది. ఇది హిందీ సినిమా `పింక్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అదే సమయంలో పవన్‌ పార్టీ విషయాలు చాలా ఉన్నాయనే కామెంట్‌ కూడా వినిపిస్తుంది. `పింక్‌`తో పోల్చితే అస్సలు బాలేదని కొంత మంది కామెంట్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఏపీలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వలేదు. పవన్‌ సినిమాని ఎందుకు రాజకీయం చేస్తున్నారనే నినాదం ఊపందుకుంది. జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్. దీంతో జగన్‌ అభిమానులు ప్రతిస్పందిస్తున్నారు. `డిజాస్టర్‌వకీల్‌సాబ్‌` అనే యాష్‌ ట్యాగ్‌తో ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. దాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అది ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఈ సినిమా చెన్నైలో ఒక్క షో కూడా పడలేదట. హైకోర్ట్ ఆర్డర్‌ ఇస్తే మమ్మల్ని అంటారేంటి? అంటూ విమర్శిస్తున్నారు. 

మరోవైపు ఈ సినిమాని కొన్న డిస్టిబ్యూటర్లు నష్టపోవాల్సిందే అంటున్నారు. సినిమా ఫస్టాఫ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అని, పవన్‌ యాక్టింగ్‌ మైనస్‌ అని అంటున్నారు. ఫస్ట్ డేనే చాలా థియేటర్లు కాళీ అని చెబుతున్నారు. దీంతో సినిమాపై నెగటివ్‌ టాక్‌ ప్రచారం కూడాఊపందుకుంది. మరి ఈ సినిమా నెగటివ్‌ టాక్‌ని దాటుకుని సక్సెస్‌ సాధిస్తుందా? లేదా చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?