పుకార్లు సృష్టిస్తే కోర్ట్ కి వెళ్తాః నటి రాధికా శరత్‌ కుమార్‌ ఫైర్‌

Published : Apr 09, 2021, 02:27 PM IST
పుకార్లు సృష్టిస్తే కోర్ట్ కి వెళ్తాః నటి రాధికా శరత్‌ కుమార్‌ ఫైర్‌

సారాంశం

కొన్ని రోజులుగా రాధిక ఆరోగ్యం బాగా లేదని, కరోనా సోకిందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టారు. ఇందులో వదంతులు సృష్టించే వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. 

`నాపై కొందరు కావాలని వదంతులు సృష్టిస్తున్నారు. పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా` అని అంటోంది రాధికా శరత్‌ కుమార్‌. కొన్ని రోజులుగా రాధిక ఆరోగ్యం బాగా లేదని, కరోనా సోకిందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టారు. ఇందులో వదంతులు సృష్టించే వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో తనకు కరోనా సోకలేదనే సందేశాన్నిచ్చింది. 

`మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నాకు కోవిడ్‌ సోకలేదు. వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉన్నా. ఆరోగ్యం గురించి కొంతమంది ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారు. ఈ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తా` అని ఆమె ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజుకి లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈసారి సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. 

బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగులో అల్లు అరవింద్‌, దర్శకుడు త్రివిక్రమ్‌, నివేదా థామస్‌, అలాగే హిందీలో అమీర్‌ ఖాన్‌, అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తీక్‌ అర్యన్‌ వంటి వారికి కరోనా సోకింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నటి రాధిక శరత్‌ కుమార్‌ తమిళంలో `పరిందల్‌ పరాశక్తి`, `జైల్‌`,`కురుతి ఆట్టమ్‌` చిత్రాల్లో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?