మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన చరణ్ కి ధన్యవాదాలు చెప్పిన పవన్

Published : Sep 03, 2020, 10:52 AM IST
మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన చరణ్ కి ధన్యవాదాలు చెప్పిన పవన్

సారాంశం

పవన్ బర్త్ డే సంధర్భంగా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ కి గురై ఫ్యాన్స్ మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవడానికి చరణ్, అల్లు అర్జున్ మరియు పవన్ నటిస్తున్న చిత్ర నిర్మాతలు ముందుకు వచ్చారు. మానవతా దృక్పధంతో స్పందించిన తీరుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముగిశాయి. అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియా వైడ్ గా పవన్ బర్త్ డే ట్రెండ్ అయ్యింది. నిన్న సోషల్ మీడియాలో సందడి మొత్తం పవన్ ఫ్యాన్స్ దే. తనకు బర్త్ డే విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికి పవన్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కాగా  రామ్ చరణ్, అల్లు అర్జున్, నిర్మాత దిల్ రాజు, నవీన్ ఎర్నేని మరియు ఏ ఎమ్ రత్నంలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

 కుప్పంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా ముగ్గురు పవన్ అభిమానులు మరణించారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. పవన్ బర్త్ డే సంధర్భంగా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ కి గురై వారు మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవడానికి చరణ్, అల్లు అర్జున్ మరియు పవన్ నటిస్తున్న చిత్ర నిర్మాతలు ముందుకు వచ్చారు. 

చనిపోయిన ముగ్గురు అభిమానులకు వీరందరూ ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా పవన్ వారికి ఓ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మానవతా దృక్పధంతో స్పందించిన తీరుకు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వకీల్ సాబ్ మోషన్స్ పోస్టర్ తో పాటు క్రిష్, హరీష్ శంకర్ మరియు సురేంధర్ రెడ్డి చిత్రాల అప్డేట్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా