సుశాంత్ మరణానికి కారణం అదే...కేకే సింగ్ తాజా ఆరోపణలతో వెలుగుచూస్తున్న కొత్త విషయాలు

Published : Sep 03, 2020, 09:03 AM IST
సుశాంత్ మరణానికి కారణం అదే...కేకే సింగ్ తాజా ఆరోపణలతో వెలుగుచూస్తున్న కొత్త విషయాలు

సారాంశం

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపణలు సంచలంగా మారాయి. సుశాంత్ మరణానికి కారణం తిరస్కరణే అని స్టేట్మెంట్ ఇచ్చారు. కేకే సింగ్ వాంగ్మూలం ముంబై పోలీసులు నమోదు చేశారు.   

సుశాంత్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ తాజా వ్యాఖ్యలు సుశాంత్ ది ఆత్మహత్యే అన్నట్లుగా ఉంది. తిరస్కరణే సుశాంత్ చావుకు కారణం అని కేకే సింగ్ చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ పెద్దల తిరస్కరణ వలన లేక ప్రేయసి రియా చక్రవర్తి దూరం పెట్టడం వలన  మరణించి ఉంటారన్న అర్థంలో ఆయన చెప్పడం విశేషం. కేకే సింగ్ తాజా వ్యాఖ్యలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒప్పుకున్నట్లుగా గా ఉంది. 

అదే సమయంలో సుశాంత్ మానసిక వేదనకు గురవుతున్నట్లుగా ఎటువంటి సూచనలు కనిపించలేదని కేకే సింగ్ అన్నారు. 2019 జూన్ 13న బీహార్ వచ్చిన సుశాంత్ 16న తిరిగి ముంబై వెళ్లిపోయారు. తాను ఎప్పుడు వాట్స్ అప్ చాట్ చేసినా రిప్లై ఇచ్చేవాడని చెప్పారు. అలాగే రియా చక్రవర్తిపై ఆయన మరోమారు తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. కేకే సింగ్ స్టేట్మెంట్ ముంబై పోలీసులు రికార్డు చేశారు. 

ఇక ఈ కేసులో కేకే సింగ్ తరపు న్యాయవాదిగా ఉన్న వికాస్ సింగ్ సుశాంత్ మానసిక ఆరోగ్యంపై వస్తున్న ఆరోపణలు ఫ్యామిలీని ఎంతో బాధపెట్టాయి అన్నారు. ఒకవేళ రియా చక్రవర్తి చెవుతున్నట్లుగా సుశాంత్ మానసిక వ్యాధితో బాధపడుతుంటే ఆ విషయం రియా కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు అన్నారు. ఇక్కడ సుశాంత్ మెడిసిన్ గురించి మాత్రమే ఆధారాలు ఉన్నాయి కానీ రిపోర్ట్స్ లేవని అన్నారు. మరో వైపు సీబీఐ ఈ కేసును విచారిస్తుండగా రియా తండ్రి నిన్న విచారణకు హాజరయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?