కేంద్రం మెడలు వంచుతామంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్

Published : Jan 23, 2017, 09:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కేంద్రం మెడలు వంచుతామంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్

సారాంశం

కేంద్రం మెడలు వంచుతామంటూ పవన్ ట్వీట్ రాజకీయంగా దుమారం లేపుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కేంద్రంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం లేపాడు . ''తిడితే భరించాం , విడగొట్టి గెంటేస్తే సహించాం .... ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం ''  , గాంధీ ని ప్రేమిస్తాం , అంబేద్కర్ ను ఆరాధిస్తాం .... సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ ..... తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పొతే చూస్తూ కూర్చోమ్  , మెడలు వంచి కింద కూర్చోబెడతామని హెచ్చరిస్తూ ట్వీట్ చేసాడు పవన్ .

గతకొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ పోరాడుతున్న పవన్ అడపా దడపా జనాల్లోకి వెళ్లి అందుకు సమాయత్తం చేస్తూనే ఉన్నాడు . సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ యూత్ ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు పవన్ . ఆంధ్రప్రదేశ్ నాయకులకు తెగువ , ఆత్మగౌరవం లేవని ఘాటుగా విమర్శించాడు . యువత స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని పిలునిచ్చాడు పవన్ .

PREV
click me!

Recommended Stories

OTT Movies: కాంట్రవర్షియల్ మూవీతో పాటు మలయాళీ థ్రిల్లర్స్, సుమ కొడుకు సినిమా.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే
హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్