‘వకీల్ సాబ్‌’: ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ లోనూ..కాలేజ్ స్టూడెంట్ గానూ !

By Surya Prakash  |  First Published Apr 8, 2021, 11:55 AM IST

ఆ విషయంలో దర్శక,నిర్మాతలు చాలా క్లారిటీగా ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా  `పింక్‌`లో ఫైట్స్‌లేవు. కానీ `వ‌కీల్ సాబ్`లో ఐదు ఫైట్స్ ఉన్నాయని వినికిడి‌. ఇంటర్వెల్ కు ముందు మూడు.. ఆ త‌ర‌వాత రెండు ఫైట్లూ ఉండ‌బోతున్నాయి. 


రేపీ టైమ్ కు ‘వకీల్ సాబ్‌’ థియోటర్ లో దిగిపోయి తన సత్తా చూపించటం మొదలెట్టేస్తాడు. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉన్నాయి. పేరుకి రీమేక్ అయినా ప్రధాన కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కించారు. పింక్ సినిమాకు ఈ సినిమా కమర్షియల్ వెర్షన్. పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తాయో అవన్ని ఉంటూనే, అసలు మెసేజ్  పోకుండా జాగ్రత్త పడాలి. అదీ ఈ సినిమా టాస్క్. ఆ విషయంలో దర్శక,నిర్మాతలు చాలా క్లారిటీగా ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా  `పింక్‌`లో ఫైట్స్‌లేవు. కానీ `వ‌కీల్ సాబ్`లో ఐదు ఫైట్స్ ఉన్నాయని వినికిడి‌. ఇంటర్వెల్ కు ముందు మూడు.. ఆ త‌ర‌వాత రెండు ఫైట్లూ ఉండ‌బోతున్నాయి. 

మరీ ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీనే ఓ ఫైట్‌తో అని స‌మాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి ఈ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే...రౌడీలు కొందరు .ఓ ఇంటిని బలవతంగా ఖాళీ చేయిస్తూంటారు. అందులో సామాన్ల‌న్నీ విసిరేస్తుంటారు‌. ఆ క్రమంలో వివేకానందుడి ఫొటో విసిరేస్తున్న‌ప్పుడు ఆ ఫొటోని గాల్లోనే ఓ చేయి వ‌చ్చి ప‌ట్టుకుంటుంది‌. ఆ చేయి… ప‌వ‌న్ క‌ల్యాణ్ ది అని చెప్తున్నారు. ఆ తర్వాత రౌడీలతో ఓ పెద్ద ఫైట్. వకీలుకు నీకు ఇక్కడేం పని అంటే ..వాదించటమే కాదు బయిట వాయిస్తాను కూడా వంటి డైలాగు చెప్తాడట. 

Latest Videos

ఇలా ఈ ఫైట్ ని అదిరిపోయేలా తెర‌కెక్కించార‌ని టాక్‌. అలాగే ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టూడెంట్ లీడ‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ప్లాష్ బ్యాక్ లో  శ్రుతిహాస‌న్ కనిపించనుంది.  ఓ కేసులో చిక్కుకున్న ముగ్గురు యువతులను కాపాడే లాయర్‌గా ఇందులో పవన్ నటిస్తున్నాడు. అతడి కంటే ముందే ఈ పాత్రను హిందీలో అమితాబ్, తమిళంలో అజిత్ చేశారు. అయితే, ఆ రెండు భాషల్లో లేని విధంగా ‘వకీల్ సాబ్'లో హీరో పాత్రను బాగా ఎలివేట్ చేసి చూపించబోతున్నారని తెలిసింది.
 

click me!