ఏజెంట్ గా అఖిల్...  లుక్ సరికొత్తగా ఉందే!

Published : Apr 08, 2021, 10:24 AM IST
ఏజెంట్ గా అఖిల్...  లుక్ సరికొత్తగా ఉందే!

సారాంశం

లాంగ్ కర్లీ హెయిర్, గడ్డం. బ్లాక్ కోట్ ధరించిన అఖిల్ మాస్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అఖిల్ గత మూడు చిత్రాలకు భిన్నంగా అఖిల్ సురేంధర్ రెడ్డి మూవీలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఏజెంట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రకటించారు.

దర్శకుడు సురేంధర్ రెడ్డి యంగ్ హీరో అఖిల్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు. లాంగ్ కర్లీ హెయిర్, గడ్డం. బ్లాక్ కోట్ ధరించిన అఖిల్ మాస్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అఖిల్ గత మూడు చిత్రాలకు భిన్నంగా అఖిల్ సురేంధర్ రెడ్డి మూవీలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఏజెంట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రకటించారు. అఖిల్ బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.

 
ఇక స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించే అవకాశం కలదు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ బ్రహ్మం సుంకర ఏజెంట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. 


మరోవైపు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక హీరోగా అఖిల్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా, ఆయనకు సరైన హిట్ దక్కలేదు. ఆయన నటించిన మూడు సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేదు.

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?
Karthika Deepam 2 Today Episode : బాంబ్ పేల్చిన దాసు, షాక్ లో శివన్నారాయణ ఫ్యామిలీ, జ్యో రహస్యం బయటపడిందా ?