
తొలి చిత్రమే దారుణంగా పరాజయం చెందితే ఏ దర్శకుడైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. కానీ హరీష్ శంకర్ వేరు. తొలి చిత్రం షాక్ తో ఊహించని షాక్ తగిలింది. కానీ పడిన కెరటం లాగా మళ్ళీ లేచిన హరీష్ నేడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు.
నేడు హరీష్ శంకర్ తన 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి హరీష్ శంకర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ' ప్రేక్షకుల నాడీ, నవతరం అభిరుచులు తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు భాష, రచనలు, కళల గురించి హరీష్ శంకర్ కి చక్కటి అవగాహన ఉంది. ఆయన భవిష్యత్తులో మరిన్ని విషయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పవన్ ప్రకటన విడుదల చేశారు.
షాక్ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్.. రవితేజతో మరోసారి మిరపకాయ్ తీస్తూ సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. దీనితో హరీష్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఇక హరీష్ వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే, గడ్డలా కొండగణేష్ లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు.
ప్రస్తుతం హరీష్.. పవర్ స్టార్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.