ఆ భయం నన్ను వెంటాడింది... తన మానసిక సంఘర్షణ బయటపెట్టిన సాయి పల్లవి!

Published : Mar 31, 2023, 04:20 PM ISTUpdated : Mar 31, 2023, 04:37 PM IST
ఆ భయం నన్ను వెంటాడింది... తన మానసిక సంఘర్షణ బయటపెట్టిన సాయి పల్లవి!

సారాంశం

సాయి పల్లవి ఒక దశలో చాలా సంఘర్షణకు లోనయ్యారట. ఆత్మన్యూనతా భావంతో భయపడుతూ ఉండేవారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.   

చేసింది తక్కువ చిత్రాలే అయిన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది హీరోయిన్ సాయి పల్లవి. ఈ నాచురల్ బ్యూటీ నటించిన ఫిదా, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సూపర్ హిట్ కొట్టాయి. ఆ చిత్రాల్లో ఆమె పాత్రలు విపరీతంగా ఆకర్షించాయి. పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవికి తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఈ జనరేషన్లో నిబంధనలు పెట్టుకుని సినిమాలు చేసే వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ సాయి పల్లవి. 

ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ప్రాధాన్యత లేని పాత్ర సాయి పల్లవి చేయదు. స్కిన్ షోకి దూరం. డిమాండ్ ఉన్నప్పటికీ రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కాగా కెరీర్ ప్రారంభంలో సాయి పల్లవి మానసిక సంఘర్షణకు గురయ్యారట. తనపై తనకు అసలు నమ్మకం ఉండేది కాదట. తన వాయిస్, డ్రెస్సింగ్, ముఖం మీద మొటిమలు కారణంగా... తనను ప్రేక్షకులు ఆదరిస్తారా? దర్శకులు అవకాశాలు ఇస్తారా? అనే సందేహాలు ఉండేవట. ఆ భయంతో ఏం చేయాలన్నా సంకోచించేవారట. 

అయితే ప్రేమమ్ దర్శకుడు తనపై నమ్మకంతో ఆ పాత్రకు ఎంపిక చేశాడట. ప్రేమమ్ విడుదలయ్యాక ఆమెలో విశ్వాసం పెరిగిందట. ఆ సినిమా చూస్తూ నా పాత్రకు ఆడియన్స్ ఈలలు వేస్తూ, చప్పట్లు కొట్టిన క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేనని, సాయి పల్లవి వెల్లడించారు. చాలా సినిమాల్లో నేను మేకప్ లేకుండానే నటించాను. దర్శకులు కూడా మేకప్ వేసుకోమని ఇబ్బంది పెట్టలేదు. బహుశా మేకప్ లేకుండా నటిస్తున్నందుకే ప్రేక్షకులు నన్ను అంతగా ఇష్టపడుతున్నారేమో... అని సాయి పల్లవి అన్నారు. 

ఈ మధ్య సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే అంశం. ఈ నేపథ్యంలో  సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారని. డాక్టర్ వృత్తి చేపట్టబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. సాయి పల్లవి ఈ వార్తలను ఖండించారు. మంచి సబ్జెక్ట్ దొరికితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాను అన్నారు. ప్రేక్షకులు నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా భావిస్తారు. కాబట్టి మంచి పాత్రలు చేయాల్సిన బాధ్యత నాపై ఉందని ఆమె గతంలో వెల్లడించారు. సాయి పల్లవి నటించిన చివరి తెలుగు చిత్రం విరాటపర్వం. అలాగే గార్గి టైటిల్ తో ఓ తమిళ చిత్రం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా