ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. రీ రిలీజ్ కు రెడీ అవుతున్న సింహాద్రి మూవీ.

Published : Mar 31, 2023, 04:21 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్  కు గుడ్ న్యూస్ .. రీ రిలీజ్ కు రెడీ అవుతున్న సింహాద్రి మూవీ.

సారాంశం

టాలీవుడ్ స్టార్  డైరెక్టర్  ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో..  ఎన్టీఆర్ నటించిన  సినిమా సింహాద్రి  బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధించన ఈ మూవీ.. రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది.    

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుంది.  స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు.. అకేషన్ ను బట్టి రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలా చేయడం వల్ల.. మరోసారి కలెక్షన్లు సాధించడంతో పాటు.. సదరు హీరోలకు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చి పబ్లిసిటీ పొందుతున్నారు. ముఖ్యంగా స్టార్స్.. బర్త్ డేలు, ప్రత్యేకమైన రోజుల్లో రీ-రిలీజ్ కుప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ట్రేండ్ ఏంటంటే.. పాత సినిమాలను  4k వెర్షన్ లో..  రిలీజ్ చేస్తూ.. మరింత బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నారు. 

ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాలు అకేషన్ న్ ప్రకారం  రీరిలీజ్ చేశారు. ఇక మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ సింహాద్రి. ఈసినిమా  రీరిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే ఈ రిలీజ్ కోసం 4కే వెర్షన్ లో ప్రింట్ రెడీ అవుతోంది. 

సింహాద్రి చిత్రానికి సంబంధించిన 4K రీ-మాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్‌డితో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో రీ-రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతుంది.  భూమికా, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. సింహాద్రి చిత్రాన్ని ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారా అనే విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30  చేస్తున్నాడు ఈరోజు( మార్చి 31 ) షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సినిమాగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా..  శరవేగంగా జరిపేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం