ప్రేమికుల రోజు పవన్‌ సర్‌ప్రైజ్‌.. మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్న పవర్ స్టార్‌..

Published : Feb 09, 2023, 09:55 AM IST
ప్రేమికుల రోజు పవన్‌ సర్‌ప్రైజ్‌.. మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్న పవర్ స్టార్‌..

సారాంశం

ఇప్పటికే మూడు సినిమాలను స్టార్ట్ చేసిన పవన్‌.. ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించబోతున్నారు. ప్రేమికుల రోజుని ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాల జోరు మామూలుగా లేదు. వరుసగా కొత్త సినిమాలకు కమిట్‌ అవుతూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. రెండు సినిమాలు ప్రారంభోత్సవాలు జరుపుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాకి కమిట్‌ అయ్యారు. అంతేకాదు త్వరలోనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్బంగా ఫ్యాన్స్ ని మరోసారి సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. 

అదేంటనేది చూస్తే, పవన్‌ తమిళంలో హిట్‌ అయిన `వినోదయ సీతం` చిత్ర రీమేక్‌కి ఓకే చెప్పారు. సముద్రఖని రూపొందించిన చిత్రమిది. ఆయన దర్శకత్వంలోనే రీమేక్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయడమే కాదు, ఏకంగా షూటింగ్‌ కూడా చేయబోతున్నారట. ఇప్పుడు పవన్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` తోపాటు ఈ రీమేక్‌ని కూడా చిత్రీకరించబోతున్నారట. ఈ సినిమాకి పవన్‌ ఇరవై రోజుల డేట్స్ కేటాయించినట్టు సమాచారం. 

ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవుడి పాత్రలో పవన్‌ నటించనున్నారు. `గోపాలగోపాల`లో పవన్‌ దేవుడి(కృష్ణుడు)గా నటించారు. ఇప్పుడు ఇందులోనూ దేవుడిగా కనిపిస్తారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిగా సాయిధరమ్‌ తేజ్‌ కనిపిస్తారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా ఇదే ఏడాదిలో రిలీజ్‌ చేయబోతున్నారట. ఇప్పటికే `హరిహరవీరమల్లు` సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే `వినోదయ సీతం` రీమేక్‌ని కూడా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారట. 

ఇక పవన్‌ చేస్తున్న సినిమాల్లో `హరిహర వీరమల్లు` చిత్రంతోపాటు `వినోదయ సీతం` రీమేక్‌, అలాగే హరీష్‌ శంకర్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, సుజిత్‌ `ఓజీ` చిత్రాలున్నాయి. మొదట `హరిహర వీరమల్లు`, `వినోదయ సీతం` చిత్రాలను పూర్తి చేసి, ఆ తర్వాత హరీష్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` షూటింగ్‌లో పాల్గొంటారట. ఆ తర్వాత `ఓజీ` మూవీకి డేట్స్ కేటాయించినట్టు టాక్‌. ఏ సినిమాకైనా ముప్పై రోజులకు మించి డేట్స్ ఇవ్వలేదని సమాచారం. ఓ వైపు ఏపీలో ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయి. చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మరి వీటిని ఎప్పుడు ఫినీష్‌ చేస్తాడనేది పెద్ద ప్రశ్న. కానీ వరుసగా సినిమాలు స్టార్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నారు పవన్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?