Sir Movie Trailer: సార్ మూవీ ట్రైలర్... సోషల్ మెసేజ్ తో వచ్చిన ధనుష్!

Published : Feb 08, 2023, 07:41 PM ISTUpdated : Feb 08, 2023, 07:46 PM IST
Sir Movie Trailer: సార్ మూవీ ట్రైలర్... సోషల్ మెసేజ్ తో వచ్చిన ధనుష్!

సారాంశం

ధనుష్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం సార్. విడుదలకు సిద్దమైన సార్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. 

సార్ మూవీ విద్యావ్యవస్థపై తెరకెక్కిన సెటైరికల్ డ్రామా. ఒక కార్పొరేట్ విద్యాసంస్థల యజమాని కుట్రలో భాగంగా గవర్నమెంట్  స్కూల్స్, కాలేజెస్ మూత పడే పరిస్థితి వస్తుంది. ఎడ్యుకేషన్ ని ఖరీదైన వస్తువుగా మార్చేసి పేదోడు అప్పులు చేసైనా చదవాలని ప్లాన్ చేస్తారు. విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే సార్ మూవీ కథ. కాంటెంపరరీ టాపిక్ ఎంచుకొని కమర్షియల్ అంశాలు జోడించి సార్ మూవీ తెరకెక్కించారు. 

కథ మెయిన్ ప్లాట్ సోషల్ మెసేజ్. దానికి లవ్, రొమాన్స్, కామెడీ వంటి కమర్షియల్ యాంగిల్ జోడించారు. సముద్రఖని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. సాయి కుమార్ సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు. సంయుక్త సార్ మూవీలో ధనుష్ కి జంటగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ, ఎస్ సౌజన్య నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరికి సార్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఆయన గత రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే పరాజయం పొందాయి. దీంతో సార్ విజయం వెంకీ కెరీర్ కి చాలా అవసరం. 

కథ మెయిన్ ప్లాట్ సోషల్ మెసేజ్. దానికి లవ్, రొమాన్స్, కామెడీ వంటి కమర్షియల్ యాంగిల్ జోడించారు. సముద్రఖని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. సాయి కుమార్ సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు. సంయుక్త సార్ మూవీలో ధనుష్ కి జంటగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ, ఎస్ సౌజన్య నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరికి సార్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు