సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన పవన్ సతీమణి అన్నా కొణిదెల..భర్తతో ఆమె సంతోషం చూశారా

Published : Jul 20, 2024, 07:21 PM IST
సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన పవన్ సతీమణి అన్నా కొణిదెల..భర్తతో ఆమె సంతోషం చూశారా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనా గారికి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. 

ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు.శ్రీమతి అనా కొణిదెల గారు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. 

ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత  డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో శ్రీమతి అనా గారు మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

 

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆమె డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత తన భర్త పవన్ కళ్యాణ్ తో కలసి సంతోషాన్ని పంచుకున్నారు. వీరిద్దరి బ్యూటిఫుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?