అఫీషియల్: సెల్ఫ్ క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్

Surya Prakash   | Asianet News
Published : Apr 11, 2021, 03:05 PM IST
అఫీషియల్: సెల్ఫ్ క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్

సారాంశం

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, కార్య నిర్వాహకులు, సన్నిహితుల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో పవన్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు.

కరోనా సిని బాగా పరిశ్రమను భయపెడుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనాతో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. క్వరంటైన్ లోకి వెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.  ఈమేరకు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ప్రకటనను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, కార్య నిర్వాహకులు, సన్నిహితుల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో పవన్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు.

పవన్ కళ్యాణ్  తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నివేద థామస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ అంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా సోకడంతో నివేద వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. ప్రీ రిలీజ్ తర్వాత మరో నటి అంజలి సైతం కరోనా భారిన పడిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది అంజలీ. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్దితి తలెత్తింది. 

పవన్ సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో పవన్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. సిబ్బందితో ఆయన చాలా దగ్గరగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా… కరోనా విస్తృతిని అడ్డుకుకోవడానికి పవన్ క్వారంటైన్ కు వెళ్లారని తెలిపారు. డాక్టర్ల సూచనమేరకు ప్రశాంత వాతావరణంలో ఆయన సమయాన్ని గడుపుతున్నరని… అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తూ.. కార్యకర్తలతో  టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు.

 పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో నివేద థామస్, అంజలీ, అనన్య నాగళ్ళ నటించారు.

PREV
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే