ఎట్టకేలకు ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బాలయ్య.. ఉగాది స్పెషల్‌

Published : Apr 11, 2021, 12:11 PM ISTUpdated : Apr 11, 2021, 12:34 PM IST
ఎట్టకేలకు ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌ చెప్పిన బాలయ్య.. ఉగాది స్పెషల్‌

సారాంశం

`బీబీ3` సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌, చిన్న గ్లింప్స్, విడుదల తేదీ తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎట్టకేలకు ఈ ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `బీబీ3` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌, చిన్న గ్లింప్స్, విడుదల తేదీ తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ కన్ఫమ్‌ చేయలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఎట్టకేలకు చిత్ర బృందంలో చలనం కలిగింది. ఈ ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఉగాది  సందర్బంగా ఈ నెల 13న మధ్యాహ్నం 12.33 గంటలకు ఈ చిత్ర టైటిల్‌ని ప్రకటించనున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్‌. దీంతో బాలయ్య అభిమానుల్లో జోష్‌ నింపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి పలు పేర్లు ఆ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో ప్రధానంగా `గాడ్‌ఫాదర్‌` అనే టైటిల్‌ని వైరల్‌గా మారింది. చిత్ర కథకి, బాలయ్య ఇమేజ్‌కి ఈ టైటిల్‌ పర్‌ఫెక్ట్ అనే టాక్‌ వినిపించింది. మరి ఎలాంటి టైటిల్‌ పెడతారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. అందుకే `బీబీ3` వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. గతంలో వీరి కాంబినేషన్‌లో `సింహా`, `లెజెండ్‌` చిత్రాలు వచ్చిన బాక్సాఫీసు వద్ద బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో తాజా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్య సైతం ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టాలని భావిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మే 28న విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?