పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?

Published : Nov 20, 2018, 09:45 AM ISTUpdated : Nov 20, 2018, 09:47 AM IST
పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?

సారాంశం

రాజకీయాల్లోకు పూర్తిగా వచ్చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు సినీ కెరీర్ కు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లే అని అందరూ భావిస్తున్నారు. ఎలక్షన్స్ కూడా దగ్గరపడటంతో పవన్ కు ఖాళీ కూడా లేదు.

రాజకీయాల్లోకు పూర్తిగా వచ్చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు సినీ కెరీర్ కు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లే అని అందరూ భావిస్తున్నారు. ఎలక్షన్స్ కూడా దగ్గరపడటంతో పవన్ కు ఖాళీ కూడా లేదు. తన పెట్టిన జనసేన పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లటం, బలోపేతం చెయ్యటం మీదే దృష్టి  పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ సినిమా చెయ్యబోతున్నారంటూ వార్తలు వెబ్ మీడియాలో మొదలయ్యాయి. తన పొలిటికల్ స్టాండ్ చుట్టూ ఉండే కథ ఒకటి రూపొందించుకుని సినిమా చెయ్యాలని ఆయన భావిస్తున్నారట.

ఓ ప్రక్కన తెలుగుదేశానికి ..ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రచారానికి పనికి వస్తుంది. మరో ప్రక్క యాత్ర చిత్రం వైయస్ ఆర్పీ పార్టీ ప్రచారానికి ఉపకరిస్తుంది. దాంతో  తమ పార్టీకి కూడా సినిమాలాంటిది ఉంటే త్వరగా ప్రజల్లోకి తమ సిద్దాంతాలను పంపవచ్చనే పవన్ ఆలోచన చేస్తున్నారట. అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశ సమయంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు మంచి మైలేజి ఇచ్చాయి. కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లోనూ వినపడుతోంది.

అలాగే ఈ చిత్రానికి దర్శకుడు డాలిని డైరక్టర్ గా ఎంచుకున్నట్లు సమాచారం. డాలీతో ఆయన గతంలో  `గోపాల గోపాల‌`,`కాట‌మ‌రాయుడు` సినిమాలు చేసారు. తన వర్క్ స్టైల్ ని అర్దం చేసుకుని ,చాలా స్పీడుగా ఫినిష్ చేసి ఇస్తాడని డాలిని పవన్ నమ్ముతున్నారు.  ఈ మేరకు మాటలు కూడా జరిగాయని చెప్పుకుంటున్నారు. అయితే సినిమాపై తను దృష్టి పెడితే పార్టీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనే విషయమై పార్టీ లో ముఖ్యులైన మిగతావారితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అయితే పార్టీకి మాత్రం ఓ ప్రచార చిత్రంలాంటిది మాత్రం కావాలనేది అభిమానుల ఆశ కూడా. 

బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?

PREV
click me!

Recommended Stories

Bigg Boss తర్వాత నా కళ్లు తెరుచుకున్నాయి.. సింగర్ గీతా మాధురి
Poonam Kaur: తనకి ఎలాంటి భర్త కావాలో అప్పుడే చెప్పిన పూనమ్ కౌర్.. అలాంటి వ్యక్తి ఇంకో పీస్ ఉండరు