పూరి కొడుకు నెక్ట్స్ సినిమా ఖరారు, డైరక్టర్ ఎవరంటే..!

Published : Nov 20, 2018, 09:39 AM IST
పూరి కొడుకు నెక్ట్స్ సినిమా ఖరారు, డైరక్టర్ ఎవరంటే..!

సారాంశం

స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చేత తమ పిల్లలను హీరోగా లాంచ్ చేయాలని అని కలలు కన్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అలాగే పూరి సినిమాలో చేస్తే తమ కెరీర్ పీక్స్ కు వెళ్లిపోతుందనుకుని అవకాసం కోసం ఎదురుచూసిన యంగ్ హీరోలు ఉన్నారు.

స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ చేత తమ పిల్లలను హీరోగా లాంచ్ చేయాలని అని కలలు కన్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అలాగే పూరి సినిమాలో చేస్తే తమ కెరీర్ పీక్స్ కు వెళ్లిపోతుందనుకుని అవకాసం కోసం ఎదురుచూసిన యంగ్ హీరోలు ఉన్నారు. అయితే అదంతా గతం. ఆయన తన కుమారుడు ఆకాష్‌ పూరిని సైతం హీరోగా పరిచయం చేస్తూ హిట్ ఇవ్వలేకపోయారు. ఆకాశ్ ని హీరోగా రీ లాంచ్‌ చేస్తూ  చేసిన ‘మెహబూబా’ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయి డిజాస్టర్ అయ్యింది.  

తనకు తాను హిట్ ఇచ్చుకోవాలి, తన కుమారుడుని నిలబెట్టాలని అనేది ఇప్పుడు  పూరి జగన్నాథ్ ముందున్న లక్ష్యం.  దీంతో ఆకాశ్ హీరోగా ఒక సినిమా చేయడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకి కథాకథనాలు పూరీనే సిద్ధం చేశాడు. ఈ సినిమాకి కథాకథనాలు పూరీనే సిద్ధం చేశారని టాక్.

ఇక ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితం కానుందని సమాచారం. దాంతో  ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే పూరి జగన్నాథ్ కేవలం రచన మాత్రమే చేస్తారు. అనిల్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయిందనీ .. లొకేషన్ల ఎంపిక కూడా జరిగిపోయిందని సినీ వర్గాల సమాచారం. గోవా బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ షూటింగ్ జరపనున్నారని చెబుతున్నారు.  హీరోయిన్  ఎవరనే విషయంతోపాటు, మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.     

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు