ఆ బాధ్యత తనపై వేసుకున్న పవన్ కళ్యాణ్‌.. నెక్ట్స్ టైటిల్‌ ఇదేనా?

By Aithagoni Raju  |  First Published Dec 22, 2020, 1:30 PM IST

అప్పుడు ఈ రీమేక్‌లో నటించే హీరోలెవరనేది కన్ఫమ్‌ కాలేదు. తాజాగా అన్ని సెట్‌ అయ్యాయి. దీంతో మరోసారి టైటిల్‌ కి సంబంధించిన చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌లో రకరకాల టైటిల్స్ సూచించారని తెలుస్తుంది. 


పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ని పూజా కార్యక్రమాలతో షురూ చేశారు. జనవరి మొదటి వారంలో ఈ సినిమాని  సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. సాగర్‌ కె.చంద్ర దీనికి దర్శకత్వం వహించనుండగా, ఇందులో మరో హీరోగా రానా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర పేరు తెరపైకి వచ్చింది. `బిల్లా రంగా` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. అయితే గతంలోనే ఈ టైటిల్‌ వినిపించింది. కాకపోతే అప్పుడు ఈ రీమేక్‌లో నటించే హీరోలెవరనేది కన్ఫమ్‌ కాలేదు. తాజాగా అన్ని సెట్‌ అయ్యాయి. దీంతో మరోసారి టైటిల్‌ కి సంబంధించిన చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌లో రకరకాల టైటిల్స్ సూచించారని తెలుస్తుంది. 

Latest Videos

అయితే చిత్ర కథకి `బిల్లా రంగా` అనే టైటిల్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ స్వతహాగా ఈ టైటిల్‌ని సూచించారట. గతంలో చిరంజీవి, మోహన్‌బాబు హీరోగా ఇదే పేరుతో సినిమా వచ్చింది ఆకట్టుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్‌ ఈ పేరుని ఫైనల్‌ చేయమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌ బాధ్యతలు పవన్‌ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకునే ఆలోచినలో ఉన్నారట. 

click me!