చిరుతో దోశలు వేయించిన సమంత

Published : Dec 22, 2020, 01:00 PM IST
చిరుతో దోశలు వేయించిన సమంత

సారాంశం

హోస్ట్ గా సమంత సూపర్ సక్సెస్ అన్న టాక్ వినిపిస్తుంది. రానా, తమన్నా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈ షోలో సమంత చిరంజీవిని తన క్రేజీ ప్రశ్నలతో ఇరుకున పెట్టారు. 

టాలీవుడ్ లక్కీ లేడీ సమంత హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటిటి యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న సామ్ జామ్  టాక్ షోకి వ్యాఖ్యాతగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి మంచి ఆదరణ దక్కింది. హోస్ట్ గా సమంత సూపర్ సక్సెస్ అన్న టాక్ వినిపిస్తుంది. రానా, తమన్నా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ని సమంత ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ఈ షోలో సమంత చిరంజీవిని తన క్రేజీ ప్రశ్నలతో ఇరుకున పెట్టారు. 

కాగా ఈ కార్యక్రమంలో చిరుతో సమంత దోశలు వేయించారు. దోశ వేసి దానిని మీరు తిప్పాలి అన్నారు సమంత. మాములుగా ఎవరైనా తిప్పుతారు, కళ్ళకు గంతలు కట్టుకొని తిప్పుతా అన్నారు చిరంజీవి. అలాగే ఈ షోలో ఓ వికలాంగుడైన బాలుడు చిరు పెయింట్ అద్బుతంగా వేశాడు. అనేక ఆసక్తి విషయాలతో ఈ ఎపిసోడ్ ని ఆహా సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది. తాజా ప్రోమోలో ఈ విషయాలన్నీ చూపించారు. 

కాగా చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే మూవీ విడుదల లేటైంది. దీనితో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఓ అద్భుతమైన సబ్జెక్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా... రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్