వరల్డ్ టాప్ 5 బెస్ట్ ఆల్బమ్స్ లో ‘ఖుషి’ ఫస్ట్ సింగిల్.. భారీ రెస్పాన్స్ తో దుమ్ములేపుతున్న లవ్లీ మెలోడీ..

By Asianet News  |  First Published May 11, 2023, 5:15 PM IST

విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.  ఏకంగా వరల్డ్ టాప్ 5 ఆల్బమ్స్ లో చేరిపోయింది.
 


రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఇప్పటికే నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం నుంచి మ్యూజికల్ బ్లాస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. సంగీత ప్రియులకు తెగ నచ్చేసిందని అర్థమవుతోంది.

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా Kushi మూవీ నుంచి ‘నా రోజా’ నువ్వే అనే పాటను విడుదల చేశారు. ఈ మేలోడీ ప్రపంచాన్నే ఊపేస్తోంది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ తో వాల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని సత్తా చాటింది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు. ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. '' నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే" అంటూ పాట మొత్తంలో   లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. 

Latest Videos

‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. ", నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా..’ అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది. ఈ సాహిత్యం అన్ని భాషల నుంచీ అద్భుతంగా కన్వే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ ఖుషీ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను తమ ది బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో పెట్టుకున్నారు. 24 గంటల్లో యూట్యూబ్ లో అత్యధికంగా చూసిన మోస్ట్ వ్యూస్ దక్కించుకున్న ఐదు పాటల్లో ఒకటిగా నిలిచింది. సినిమా థీమ్ ను తెలియజేస్తూనే అద్భుతమైన ఫీల్ నూ ఇస్తోన్న ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ సాంగ్స్ లో ఐదవ స్థానంలో నిలవడం విశేషం. అదేవిధంగా మూవీ బ్లాక్ బస్టర్ కు ఊతం ఇస్తుందనే చెప్పాలి. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. 

‘మహానటి’ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు.  జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నెని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. 

 

Sensational response for the lovely melody ❤️ & among the most viewed Songs on YouTube worldwide in the past 24 hours ❤️‍🔥

- https://t.co/ppoHHuX9Qo pic.twitter.com/8fXSdigW37

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!