
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి కొంత గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం కమిటైన చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నుంచి వరుసగా వినోదయ సిత్తం రీమేక్, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ ఓజి, హరిహర వీరమల్లు చిత్రాలు రాబోతున్నాయి.
ప్రస్తుతం పవన్ ఓజి షూటింగ్ తో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి షూటింగ్ లొకేషన్ నుంచి మెమొరబుల్ పిక్ పోస్ట్ చేసారు. అదేంటి.. పవన్ ఎప్పుడూ తన సినిమాల గురించి పోస్ట్ లు చేయరు కదా అని అనుకుంటున్నారుగా.. పవన్ షూటింగ్ లొకేషన్ నుంచే పోస్ట్ చేసినప్పటికీ ఇది ఓజి మూవీ గురించి కాదు. తన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తల గురించి.
ప్రస్తుతం ఓజి షూటింగ్ మహారాష్ట్రలో జరుగుతోంది. ఓ సరస్సు ఒడ్డున దర్శకుడు సుజీత్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో సరస్సు దగ్గర పవన్ కళ్యాణ్ ని రాజమండ్రికి చెందిన సింగిరి సాయి, సింగిరి రాజేష్.. కోవూరుకి చెందిన సన్నీ జాన్ అనే అభిమానులు కలిశారు. బహుశా వారు అక్కడే బోటింగ్ లేదా, చేపల వేటతో జీవనం సాగిస్తూ ఉండొచ్చు.
పవన్ కళ్యాణ్ సరస్సు ఒడ్డున షూటింగ్ చేస్తుండడంతో వీరు ముగ్గురూ పవర్ స్టార్ ని కలిశారు. వారు జనసేన జెండా చూపిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వెనుక నుంచి ఉన్న స్టీల్ ఆకట్టుకుంటోంది. ఇదే పిక్ ని పవన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ఫొటోలో కరాటేకి సంబందించిన కాస్ట్యూమ్స్ లో కనిపిస్తుండడం విశేషం. ఈ తరహా కాస్ట్యూమ్స్ లో పవన్ కళ్యాణ్ గతంలో ఖుషి, అన్నవరం లాంటి చిత్రాల్లో మెరిశారు.
మరోసారి అదే కాస్ట్యూమ్స్ లో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది. ఓజి షూటింగ్ లొకేషన్ మహారాష్ట్రలో వాయి సరస్సు వద్ద జనసైనికులని కలవడం జరిగింది అని పవన్ ట్వీట్ చేశారు. వారితో పవన్ సెల్ఫీ కూడా తీసుకున్నారు.