
ప్రభాస్ నుంచి వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆదిపురుష్`. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్.. రాముడిగా, కృతి సనన్.. సీతగా, రావణాసుడిగా సైఫ్ నటిస్తున్నారు. విజువల్ వండర్‌గా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఫ్యాన్స్ కోసం ముందుగా సోమవారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో సెలక్టెడ్ థియేటర్లలో ప్రదర్శించారు. తాజాగా ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది.
మూడు నిమిషాల 22 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్.. డీసెంట్‌గా ఉందని అంటున్నారు. ఇది నా రాముడి కథ అంటూ ఆంజనేయుడు.. రాముడి కథ చెప్పడం నుంచి ట్రైలర్ ప్రారంభమవుతుందట. అనంతరం సీతని రావణాసురుడు ఎత్తుకెళ్లే సన్నివేశాలు వస్తాయట. అయితే సీత గీత దాటే సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయట. సీత కోసం లక్ష్మణుడు, రాముడు వెతుకులాట. హనుమంతుడి స్నేహం, అనంతరం హనుమంతుడి శక్తి గురించి రాముడు చెప్పడంతో ఆయన ఇన్‌స్పైర్ తన బలాన్ని ప్రదర్శిస్తూ సీత కోసం యాత్ర చేయడం, చివరికి సీతని గురించి ఆమెని రమ్మని, రాముడి వద్దకు వెళ్దామని చెప్పగా, నా రాఘవుడు వచ్చాకనే తాను వస్తానని చెప్పడం వంటి సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయట.
మరోవైపు వదినని తీసుకురావాలని లక్ష్మణుడు రాముడిని కోరగా.. సీత ముఖ్యమా? ప్రజలు ముఖ్యమా? అనే సందర్భం వచ్చినప్పుడు ప్రజలకే రాముడి మొగ్గు చూపడం, ఆ తర్వాత రావణాసుడి ఎంట్రీ, ఆయన వరం పొందడం, లంకలో రావణాసుడి చేష్టలు, అనంతరం రాముడితో పోరాటం వంటి సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంమ్స్ తెప్పించేలా ఉందట. టీజర్ కంటే చాలా బెటర్‌గా సన్నివేశాలున్నాయని, చాలా రియలిస్టిక్‌గా ఉందని అంటున్నారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు మరో లోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందంటున్నారు.
వీఎఫ్‌ఎక్స్ టీజర్ కంటే చాలా బెటర్‌గా ఉన్నాయని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ బాగా సెట్ అయ్యారట. ఆయన ఎందుకు ఇంత డిమాండ్ ఉన్న నటుడో ట్రైలర్ చూశాక అర్థమయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో శ్రీరాముడి శకం మరోసారి ప్రారంభమవుతుందని అంటున్నారు. ట్రైలర్ కట్ ఉత్కంఠభరితంగా, చాలా క్వాలిటీగా, పవర్ ఫుల్ డైలాగ్‌లతో నిండి ఉందట. త్రీడీ క్వాలిటీ అద్భుతంగా ఉందట. విజువల్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయని అంటున్నారు. డైలాగ్‌లు ట్రైలర్‌లో హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు.
`ఆదిపురుష్` ట్రైలర్‌ని రేపు ఇండియా వైడ్‌గా ప్రదర్శించనున్నారు. అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. అందుకోసం వారణాసిలో ప్రత్యేకంగా భారీ ఈవెంట్‌ని కూడా ప్లాన్ చేశారు. అయితే ముందుగానే ప్రభాస్ ఫ్యాన్స్ కి చూపించి ట్రైలర్‌పై మరింత హైప్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది యూనిట్. హైదరాబాద్‌లోని ఏఎంబీలో ట్రైలర్ ప్రదర్శనకి ప్రభాస్ రావడం విశేషం. ఆయన అభిమానుల మధ్య ట్రైలర్‌ని వీక్షించారు. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు.