
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 గురించి దేశం అంతా ఎదురు చూస్తోంది. ఈసినిమాపై ఇప్పటికీ.. ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈమూవీకి సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న.. సినిమా పుష్ప2. ఈమూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేకర్స్. పుష్ప- ది రైజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమా.. పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతోంది. ఇక పుష్పతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాధించాడు బన్నీ. అందుకే పుష్ప2ను అంతకు మించి చూపించాలని పట్టుదలతో ఉన్నారు.
ప్రస్తుతం పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 2 పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. పుష్ప 2 లో ఓ అతిధి పాత్ర ఉంది. అదే గిరిజన యువతి పాత్ర. తాజాగా ఈ గిరిజన యువతి పాత్ర కోసం మెగా డాటర్ నిహారికను మూవీ టీమ్ సంప్రదించినట్టు సమాచారం. అంతే కాదు ఆమె ఈ పాత్రకు ఆమె ఒప్పుకున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా మాత్రం మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు.
ఇప్పటి వరకూ రూమర్ గానే ఉన్న ఈ న్యూస్ నిజంగా నిజం అయతే.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నట్టే. అయితే.. పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. అన్నట్టు బన్నీ పాత్రను పరిచయం చేస్తూ వచ్చే ఈ అతిధి పాత్ర సినిమాలో చాలా కీలకం అట. ఇక ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి.
అందుకే పుష్ప 2 లో ఇప్పటి వరకూ వచ్చిన లుక్స్ అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇక ఇటువంటి లీకేస్ లతో .. ఇంకాస్త ఇంట్రెస్ట్ పెంచేస్తున్నారు టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.