అన్నం మానేసిన పవన్ కళ్యాణ్

Published : Jun 03, 2017, 02:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
అన్నం మానేసిన పవన్ కళ్యాణ్

సారాంశం

పవన్ కళ్యాణ్ అన్నం మానేశాడా అవును.. మానేశాడు అన్నం మానేయడమేంటి.. మీరే చదవండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ తెగ బిజీ అయిపోయారు. ఇటు సినిమాలు చేస్తూనే అనేక సామాజిక రాజకీయ అంశాలపై తరచుగా స్పందిస్తూ.. జనసేన పార్టీ 2019 ఎన్నికలకు సంసిద్ధమయ్యే దిశగా పనిచేస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటున్నారు.

46ఏళ్ల పవన్ కళ్యాణ్ సాధారణంగా టిపికల్ ఆంధ్రా భోజనం తినేందుకే ఇష్టపడతారు. అన్నం, కూరలు, పప్పు, పచ్చళ్లతో తన భోజనం మెనూ ఉంటుంది. అయితే ఆంధ్రా భోజనాన్ని అంతగా ఇష్ట పడే పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఇష్టమైన ఆ భోజనాన్ని తినటం ఇక నుంచి మానేస్తున్నారు.

పవన్ అన్నం తినటం మానేయటానికి బలమైన కారణమే ఉంది. పవన్ ఇటీవల కాటమరాయుడు సినిమాతో అన్నయ్య పాత్రలో కనిపింంచారు. ఆపాత్రలో శృతీహాసన్ ను ప్రేమలో పడేసే రాయుడుగా నటించినా... కాటమరాయుడు అనే పేరుకు తగ్గట్టుగా కేరక్టర్ లో పెద్దరికం చూపించారు. అయితే అంతకు ముందు నటించిన గబ్బర్ సింగ్ 2 సినిమాలో పవన్ కాస్త ఏజ్ డ్ గా కనిపించారని టాక్ వినిపించింది. అత్తారింటికి దారేది సినిమాలో యూత్ ఫుల్ గా కనిపించిన పవన్ ప్రస్థుతం నటిస్తున్న సినిమాలోనూ అదే మాదిరిగా యంగ్ గా కనిపించాలట.
 

ప్రస్థుతం పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ యంగ్ గా కనిపించాలట. అందుకే ముఖంలో రైస్ తినటం వల్ల వస్తున్న వాపు, చర్మం మందమెక్కుతుండటం లాంటివి కనిపిస్తుండటంతో... వెంటనే రైస్ తినటం మానేయాలని నిర్ణయించారట. గతంలో అత్తారింటికి దారేది సమయంలో కూడా త్రివిక్రమ్ కోరికమేరకు పవన్ అన్నం తినటం మానేసి చాలా యంగ్ గా కనిపించారు,

ఇప్పుడు కూడా త్రివిక్రమ్ సూచన మేరకు అదే ఫార్ములాను ఫాలో అయి మరింత యంగ్ గా కనిపించి అభిమానులను అలరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్