దువ్వాడ జగన్నాథం పై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

First Published Jun 2, 2017, 2:43 PM IST
Highlights
  • దువ్వాడ జగన్నాథంపై బ్రాహ్మణ సంఘాలల ఆగ్రహం
  • డీజే పాటల కోసం వాడిన పదాలపై బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం
  • గుడిలో బడిలో మడిలో అనే పాటలోని నమకం చమకం

అల్లు అర్జున్ హీరోగా దిల్  రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథం. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే న‌టిస్తున్న‌ది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జూన్ 23న విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.

 

తాజాగా ఈ మూవీలోని  ‘గుడిలో బ‌డిలో మ‌డిలో’ అనే సాంగ్ ని రీసెంట్ గా విడుద‌ల చేశారు . ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన‌, ఇందులోని సాహిత్యం బ్రాహ్మ‌ణుల‌ని అవ‌మాన ప‌రిచే విధంగా ఉంద‌ట‌. సాహితి రాసిన ‘నమకం.. చమకం’ అనే ప‌దాలు రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వాటిని తొల‌గించాల‌ని బ్రాహ్మ‌ణులు డిమాండ్ చేస్తున్నారు. తొల‌గించని పక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ని , పోలీస్ ఉన్న‌తాధికారుల‌కి ఫిర్యాదు చేస్తామంటూ వారు హెచ్చ‌రిస్తున్నారు.

click me!