మేకప్ వేసుకోవడానికి పవన్ రెడీ..!

Published : Sep 08, 2018, 05:02 PM ISTUpdated : Sep 09, 2018, 01:29 PM IST
మేకప్ వేసుకోవడానికి పవన్ రెడీ..!

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా 'అజ్ఞాతవాసి' సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ పూర్తి రాజకీయాలకే పరిమితమయ్యారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా 'అజ్ఞాతవాసి' సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ పూర్తి రాజకీయాలకే పరిమితమయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పాల్గొనే క్రమంలో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపించాయి.

ఇక ఆయన వెండితెరపై కనిపించే అవకాశం లేదనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన మరోసారి మేకప్ వేసుకోబోతున్నాడని టాక్. పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవనున్నారు.

అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు డాలీతో కలిసి వైష్ణవ్ సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి రామ్ తాళ్లూరి నిర్మాతగా పని చేయనున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఓ గెస్ట్ రోల్ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మేనల్లుడి కోసం మాత్రమే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్ తాళ్లూరితో ఉన్న బంధం కారణంగా పవన్ నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం