ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ.. క్లారిటీ వచ్చేసింది!

Published : Sep 08, 2018, 03:52 PM ISTUpdated : Sep 09, 2018, 12:47 PM IST
ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ.. క్లారిటీ వచ్చేసింది!

సారాంశం

నందమూరి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ తన అన్నయ్య కుటుంబానికి దగ్గరైనట్లు కనిపించారు. కళ్యాణ్ రామ్,  ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి భోజనం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

నందమూరి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ తన అన్నయ్య కుటుంబానికి దగ్గరైనట్లు కనిపించారు. కళ్యాణ్ రామ్,  ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి భోజనం చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఎన్టీఆర్, బాలకృష్ణల నడుస్తోన్న కోల్డ్ వార్ ముగిసిందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఔత్సాహికులు ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి బాలకృష్ణ అథితిగా వస్తాడని వార్తలు పుట్టించారు.

ఈ నెల 20న ఈ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు బాలయ్య వస్తాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కానీ నిజానికి ఆయన ఈ వేడుకకు రావడం లేదని తెలుస్తోంది. అసలు ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలనే ఆలోచన ఎన్టీఆర్ కి లేదట. అదే విషయాన్ని మేకర్స్ కి కూడా చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు 'అరవింద సమేత'కి సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు.

అందుకే ఈ ఈవెంట్ తో ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే రెగ్యులర్ వేడుక మాదిరి కాకుండా.. సింపుల్ గా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఆడియో ఫంక్షన్ నిర్వహించబోతున్నారట. కాబట్టి ఈ వేడుకకు బాలయ్యని ఆహ్వానించే అవకాశం లేదు. కొందరు అభిమానులు, చిత్రబృందం, కళ్యాణ్ రామ్ సమక్షంలో ఈ వేడుకను నిర్వహించబోతున్నారని సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?