భార్య పిల్లలతో పవన్ కళ్యాణ్ సమ్మర్ వెకేషన్.. బుడి బుడి అడుగులతో మెరిసిన మార్క్ శంకర్, వీడియో

Published : Apr 01, 2023, 03:40 PM IST
భార్య పిల్లలతో పవన్ కళ్యాణ్ సమ్మర్ వెకేషన్.. బుడి బుడి అడుగులతో మెరిసిన మార్క్ శంకర్, వీడియో

సారాంశం

ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ అయితే చాలా టైట్ గా ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు.

ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ అయితే చాలా టైట్ గా ఉంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేశారు. ఓజి చిత్రం కోసం సుజీత్ లొకేషన్స్ వేటలో ఉన్నారు. మరో వారం రోజుల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రారంభం కానుంది. హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 

ఈ నేపథ్యంలో పవన్ తన ఫ్యామిలీకి ఆటవిడుపుగా చిన్న సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశారు. తన భార్య అన్నా లెజినోవా.. చిన్న కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పోలేనాతో కలసి రాజస్థాన్ టూర్ వెళ్లారు. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తన తల్లి లెజినోవా చేయి పట్టుకుని మార్క్ శంకర్ బుడి బుడి అడుగులతో సందడి చేశాడు. ఈ దృశ్యాలు పవన్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మార్క్ శంకర్ ని పాయింట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలని వైరల్ చేస్తున్నారు. 

వెకేషన్ నుంచి తిరిగి రాగానే పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్ ప్రారంభిస్తారని టాక్. ఓజి చిత్రం సుజీత్ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కనుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..