
పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పటికీ ఆ చిత్రం సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 పై అందరి దృష్టి నెలకొన్న నేపధ్యంలో పుష్ప 2 గ్లింప్స్ విడుదలకు రంగం సిద్దమైంది. మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓటిటి డీల్ కు నెగోషియేషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. పుష్ప నిర్మాతలు చెప్పిన రేటుకు ముందుకు వచ్చిన ఓటిటి సంస్ద కళ్లు తిరిగనంత పనైందంటున్నారు. వివరాల్లోకి వెళితే..
పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప 2పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయనేది నిజం. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్, ఆయన టీమ్ రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. ఎక్సపెక్టేషన్స్ భారీగా పెరగడంతో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. స్క్రిప్టును మరింత కట్టుదిట్టంగా రెడీ చేసి మరీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కు హాట్ స్టార్, నెట్ ప్లిక్స్, అమేజాన్ సంస్దలు పోటి పడ్డాయి. అయితే పోటీలో నెట్ ప్లిక్స్ చివరి దాకా వెళ్లిందని సమాచారం.
అయితే నెట్ ప్లిక్స్ కు సైతం మింగుడుపడని రేటుని నిర్మాతలు చెప్పారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుతున్న సమాచారం మేరకు నెట్ ప్లిక్స్ వారికి 200 కోట్లు ఓటిటి అన్ని భాషల రైట్స్ రేటు చెప్పారని తెలుస్తోంది. దాంతో నెట్ ప్లిక్స్ ఆలోచనలో పడి..అంత రికవరీ కేవలం ఓటిటి ద్వారా ఉంటుందా అని ఆలోచనలో పడిందని అంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ చిత్రంలాగ ప్రమోట్ చేసి రికవరీ పెట్టుకోవాలి తప్పించి వేరే దారిలేదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మరో ప్రక్క ఈ చిత్రం గ్లింప్స్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ బజ్ క్రియేట్ అవుతోంది. గతడేది కేజీఎఫ్ 2 ఎవరూ ఊహించని సక్సెస్ సాధించిన తర్వాత పుష్ప సీక్వెల్ విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. మొదటి భాగంతోనే సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ను అంతకన్నా భారీగా చూపించడం ఛాలెంజే ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశపరచకుండా వాళ్లు ఆశించిన రేంజ్ లో ఈ గ్లింప్స్ ఉండటానికి సుకుమార్ కొత్త ప్లాన్ తో సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్ట్ డైరెక్టర్ రామక్రిష్ణ వెల్లడించాడు. అంతేకాదు ఇప్పటికే పుష్ప 2 గ్లింప్స్ సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాడు.
ఈ గ్లిప్స్ లో లో బన్నీ మాత్రం స్టన్నింగ్ లుక్‌తో కన్పించనున్నాడని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 కు అంతకు మించి ఉండే అవకాసం ఉంది.