అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ తనయుడు, మార్క్ శంకర్ కు గాయాలు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Published : Apr 08, 2025, 09:54 AM IST
అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ తనయుడు, మార్క్ శంకర్ కు గాయాలు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్ లో జరిగిన ఈ  ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పవన్ తనయుడి పరిస్థితి ఎలా ఉందంటే?   

Pawan Kalyan Son Mark Shankar Injured in Fire Accident:  

ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్  చిన్నకుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన  అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో సడెన్ గా అగ్ని ప్రమాదం జరిగింది. అనుకోని  ప్రమాదంలో మెగా వారసుడి  చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అంతే కాదు  ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో అతను పలు ఇబ్బందులకు  లోనయినట్టు తెలుస్తోంది. వెంటనే మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు  పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలియగానే డిప్యూటీ సీఎం సింగపూర్ వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాని పవన్ మాత్రం అరకు సమీపంలో ఉన్న కురిడి గ్రామ ప్రజలకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. అక్కడికి వెళ్ళి,  ఆ గ్రామాన్ని సందర్శించి, వారి సమస్యలు తెలుసుకున్న తరువాత  సింగపూర్ వెళ్తానని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ మాట ప్రకారంగా అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

మన్యంలో పర్యటన ముగించుకొని విశాఖ పట్నం  నుంచి  పవన్ కల్యాణ్  సింగపూర్ వెళ్ళేందుకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ లో పరిస్థితిని పవన్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి అప్ డేట్స్ ను తెలుసుకుంటూ..పరిస్థితిని సమీక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలియగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆందోళన స్టార్ట్ అయ్యింది. తమ అభిమాన హీరో వారసుడి పరిస్థితి ఎలా ఉందంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో