పిఠాపురం ప్రజలకు అకీరా నందన్‌ అభివాదం.. చిన్నమ్మతో ఫ్యాన్స్ ముందుకొచ్చిన పవన్‌ తనయుడు.. ఆ క్రేజ్‌ చూస్తే షాకే

Published : Jun 04, 2024, 04:06 PM ISTUpdated : Jun 04, 2024, 04:12 PM IST
పిఠాపురం ప్రజలకు అకీరా నందన్‌ అభివాదం.. చిన్నమ్మతో ఫ్యాన్స్ ముందుకొచ్చిన పవన్‌ తనయుడు.. ఆ క్రేజ్‌ చూస్తే షాకే

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ పిఠాపురంలో మెరిశాడు. పవన్‌ ఆ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో అకీరా నందన్‌ ప్రజలకు అభివాదం తెలియజేయడం విశేషం.   

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో విజయం సాధించారు. పదేళ్ల పోరాటం అనంతరం ఆయన ఈ సారి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. తన జనసేనా పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. సుమారు 70వేలకు పైగా ఓట్లతో ఆయన విజయం సాధించినట్టు తెలుస్తుంది. 

దీంతో పిఠాపురం ప్రజల్లో, జనసేన కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో సంతోషం అంబారాన్నింటింది. పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్ద భారీగా జన సైనికులు చేరి ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేస్తున్నారు. దీంతో అభిమానులను, కార్యకర్తలను కలవడానికి వచ్చారు పవన్‌ కళ్యాణ్‌ భార్య అన్నా కొణిదెల. ఆమెతోపాటు పవన్‌ కొడుకు అకీరా నందన్‌ కూడా రావడం విశేషం. చిన్నమ్మ అన్నా కొణిదెల వెనకాలే అకీరా నందన్‌ కూడా వచ్చాడు. ప్రజలకు, అభిమానులకు తన అభివాదం తెలిపారు. అచ్చు పవన్‌ కళ్యాణ్‌ స్టయిల్‌లో అకీరా నందన్‌ కూడా అభివాదం తెలియజేయడం విశేషం. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అకీరా నందన్‌ బయటకు రావడంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. జనసేన పార్టీ, పవన్ కి జై కొడుతూ గట్టిగా నినాదాలు చేశారు. కాసేపు వారికి కనిపించిన అకీరా నందన్‌ చిన్నమ్మతో కలిసి లోపలకి వెళ్లిపోయారు. అయితే రేణు దేశాయ్‌, పవన్‌ కళ్యాణ్‌లకు అకీరా నందన్‌ జన్మించిన విషయం తెలిసిందే. అకీరాకి చెల్లి ఆద్య కూడా ఉన్నారు. రేణు దేశాయ్‌ పవన్‌ నుంచి విడిపోయినా, పిల్లలు మాత్రం పవన్‌కి దగ్గరగానే ఉంటున్నారు. తరచూ కలుస్తుంటారు. వారి కాలేజ్‌ ఈవెంట్లకి పవన్‌ వెళ్తుంటారు. అలాగే పవన్‌ ఇంటికి కూడా వాళ్లు వస్తుంటారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పిఠాపురంలోని పవన్‌ ఇంట్లోనే వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా మారారు. కీ ప్లేయర్‌గా నిలిచారు. టీడీపీతో, బీజీపీతో పొత్తు విషయంలోనూ కీలకంగా వ్యవహరించారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. అంతేకాదు 2024 ఎన్నికల్లో పవన్‌ చక్రం తిప్పిన తీరు ఆకట్టుకుంది, అదే ఇప్పుడు విజయానికి రహదారి వేసింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?