అపోలో ఆస్పత్రిలో బండ్ల గణేష్,త్వరలో డిశ్చార్జ్ .. ఏమైంది?

Published : Jun 04, 2024, 10:23 AM IST
అపోలో ఆస్పత్రిలో బండ్ల గణేష్,త్వరలో డిశ్చార్జ్ .. ఏమైంది?

సారాంశం

బండ్ల గణేష్  తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించగా.. వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు. 


బండ్ల గణేష్ (Bandla Ganesh) హాస్పటిల్ లో ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం స్వల్ప అనారోగ్యం కారణంగా బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) అపోలో హాస్పిటల్‌ (Apollo Hospital)లో చికిత్స తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయితే ఆయన అనారోగ్యం ఏమిటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియోలో బండ్ల గణేష్ బెడ్‌పై పడుకుని ఉండగా.. నర్సు ఆయనకి ఇంజెక్షన్ ఇస్తోంది. ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఆయన ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.

బండ్ల గణేష్ కు ఛాతీలో నొప్పి, తీవ్ర అసౌకర్యంగా ఉండటంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోల్లో ఆయన తన ఛాతీని నొక్కుకుంటూ కనిపించగా.. వైద్యులు ఆయన చికిత్స కొనసాగిస్తూ కనిపించారు. ఈ వీడియోలను చూసిన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, స్నేహితులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

అయితే ప్రస్తుతం బండ్ల గణేష్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ‘ బండ్ల గణేశ్ కు వైద్య పరీక్షలు నిర్వహించాం. కొంత ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వీలైనంత త్వరగా ఆయనను డిశ్చార్జ్ చేస్తాం’ అని ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

ఇక అప్పట్లో  కరోనా టైమ్‌లో రెండు మూడు సార్లు హాస్పిటల్ పాలైన బండ్ల గణేష్ ఈ మధ్య ఆరోగ్యంగానే కనిపించారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  సమయంలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ  విజయానంతరం ఆయన యాక్టివ్‌గానే ఉంటున్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అవుతూ.. ఎవరైనా కాంగ్రెస్ పార్టీపై కామెంట్ చేస్తే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏదో పదవి కూడా ఇవ్వబోతుందనేలా వార్తలు వైరల్ బండ్లన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్