‘జపాన్’ పూర్తి?. సూర్య నిర్మాతగా కార్తీ నెక్ట్స్ మూవీ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published Jul 28, 2023, 11:12 AM IST

తమిళ స్టార్ కార్తీ (Karthi)  తర్వలో ‘జపాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందుకు సంబ:ధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తాజాగా కార్తీ27వ సినిమాపైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.


కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తమిళ ప్రేక్షకులకే కాకుండా.. తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన సినిమాలకు ఇక్కడా మంచి మార్కెట్ ఉంటడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా కార్తీ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఊపిరి’, ‘కాష్మోరా’ ‘ఖైదీ’ వంటి చిత్రాలతో అలరించారు. రీసెంట్ గా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘సర్దార్’ సినిమాలతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. 

ఇక రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తుంటాడు హీరో కార్తీ. ఇక ప్రస్తుతం కార్తీ ‘జపాన్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్స్ వారియర్స్ పై రూపుదిద్దుకుంది. ఇది 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దరక్శత్వంలో మరో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత రాబోయే 27వ చిత్రాన్ని కూడా కార్తీ పట్టాలెక్కించబోతున్నారని తాజా సమాచారం. 

Latest Videos

కార్తీ27వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఇప్పటికే కోలీవుడ్ లో 2డీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ద్వారా అన్న సూర్య, జ్యోతికలు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక కార్తీ 27వ చిత్రానికి సూర్యనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ విషయాన్ని డీవోపీ పీసీ శ్రీరామ్ కూడా ట్వీటర్ ద్వారా కన్ఫమ్ చేశారు. ఈ చిత్రానికి 96 ఫేమ్ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ డైరెక్టర్. గోవింద వసంత మ్యూజిక్ అందించనున్నారు. మిగతా విషయాలు త్వరలో రానున్నాయి. 

ఇక కార్తీ, సూర్య త్వరలో వెండితెరపై కలిసి అలరించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ ద్వర్శకత్వంలో రానున్న ‘విక్రమ్2’లో వీరిద్దరూ నటించనున్నారు. ఆ మూమెంట్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సూర్య రోలెక్స్ పాత్ర కూడా ఆడియెన్స్ ను ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఆ పాత్రకుధీటుగా కార్తీ ఢిల్లీ రోల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీ అప్డేట్ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

click me!