Pawan Kalyan: మరోసారి వాయిదా పడ్డ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్... ఈసారి కారణం ఏంటంటే....?

Published : Mar 14, 2022, 10:03 PM IST
Pawan Kalyan: మరోసారి వాయిదా పడ్డ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్... ఈసారి కారణం ఏంటంటే....?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ బిజీ.. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్. షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా టైమ్ ప్రకారం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్న పవర్ స్టార్.. హరి హర వీర మల్లు ను మాత్రం మరోసారి పోస్ట పోన్ చేసినట్టు తెలుస్తోంది.  

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఆల్ రెడీ శాతకర్ణి,మణికర్ణిక లాంటి సినిమాలతో సత్తా చాటిన క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఎ.ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో వస్తుండటంతో ఇండస్ట్రీతో పాటు... ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కాని అంతకంతకు ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వెళ్తోంది. హిస్టారికల్ సినిమాలు తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోను స్క్రీన్ మీద అద్భుతంగా చూపిస్తాడు క్రిష్. 

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు వేశారు. 50 శాతం షూటింగ్ కూడా పూర్తయిన తరువాత కరోనా ప్రభావం వలన షూటింగును వాయిదా వేశారు. మధ్యలో ఒకటి రెండు సార్లు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి ట్రై చేసినా కుదరలేదు. 

అయితే భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత పవన్ హరి హర వీరమల్లు షూటింగ్ పై దృష్టి పెడతారని అంతా భావించారు. అటు  పవన్ కూడా అదే ప్లాన్ చేసుకున్నాడు. అంతే కాదు ఈ నెల 18వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టాలనుకున్నారు. అన్ని సన్నాహాలు చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది.కారణాలు ఏవైనా.. ఇప్పుడు పవర్ స్టార్ రాజకీయంగా బిజీగా ఉండటంతో  ఏప్రిల్ రెండవ వారం నుంచి షూటింగ్ ను స్టార్ట్ చేసి.. నాన్ స్టాప్ గా సినిమా అయిపోయే వరకూ చేసుకోవాలి అని చూస్తన్నారు. మరి పవర్ స్టార్ ఏం చేస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట