Hero Karti New Look: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన హీరో కార్తి... ఎందుకిలా అయ్యాడు...?

Published : Mar 14, 2022, 07:33 PM ISTUpdated : Mar 14, 2022, 07:47 PM IST
Hero Karti New Look: ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన హీరో కార్తి... ఎందుకిలా అయ్యాడు...?

సారాంశం

ఒక సినిమా కోసం హీరోలు ఎంతవరకూ వెళ్లడానికి అయినా వెనకాడటం లేదు. క్యారెక్టర్ కోసం ఎన్ని సాహసాలు చేయడానికైనా రెడీ అంటున్నారు. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో కార్తి కూడా అలాంటి పనే చేశాడు.   

ఈ మధ్యకాలంలో సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు హీరోలు. సినిమాకోసం  ప్రాణం పెట్టి పని చేస్తున్నారు.  క్యారెక్టర్‌ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు.దాని బెస్ట్ ఎక్జాంపుల్  పుష్పోల అల్లు అర్జున్ అనిచెప్పుకోవచ్చు. ఇలాంటి పాత్రలు చేయడం అతంటే అంత ఈజీ కాదు. కాని అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తున్నారు స్టార్స్. 

హీరో అంటే మచ్చా..మరకా లేకుండా క్లీన్ గా.. నీట్ గా మంచి జిమ్ బాడీతో హీరోయిజం చూపించకుంటూ.. హీరోయిన్ తో రోమాన్స్ చేసుకుంటూనే ఉండాలి అనే రోజులు పోయాయి.హీరోలు రఫ్ అండ్ రగ్డ్ లుక్ తోరచ్చ చేస్తున్నారు. ఎవరూ గుర్తు కూడా పట్టలేనంతగా తమను తాము చేంజ్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా.  కోలీవుడ్‌ స్టార్‌ హీరొ కార్తీ కూడా ఇదే చేశాడు. తమిళంలో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 

ప్రస్తుతం కార్తి  కార్తీలా లేడు. అసలు ఈ వ్యక్తి కార్తినా లేక ఎవరోనా అన్నట్టు మారి పోయాడు. తన పాత ఛాయలు అస్సలు కనిపించకుండా మేకోవర్ అయ్యడు యంగ్ హీరో. ప్రస్తుతం కార్తి సర్దార్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కార్తి  నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం కార్తి మరో ప్రయోగం చేశాడు. ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్ గా రాశీ ఖన్నా నటిస్తోంది. 

సర్ధార్  కోసం తెగ కష్టపడుతున్న కార్తీ కంప్లీట్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. రీసెంట్ గా ఈ సినిమాలోని  కొన్ని స్టిల్స్‌ని మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో పూర్తిగా గుర్తు పట్టకుండా ఉన్న కార్తీని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. పూర్తి మేకోవర్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు కార్తి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు