
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా వచ్చి ఈ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ ను బ్రద్దలు కొట్టారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల ‘భీమ్లా’ మేనియా కొనసాగుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ హీరోగా, మరో బలమైన పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఉదయం నుంచే బెనిఫిట్ షోస్ మొదలుకావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో ఏమైనా పొలిటికల్ డైలాగులు ఉన్నాయా...ముఖ్యంగా వైయస్ జగన్ ని ఉద్దేశించి ఉన్నాయా అనేది సగటు తెలుగువాడికి ఆసక్తికరమైన విషయంగా మారింది.
అయితే ‘శుక్రవారం సంతకం’ అనే డైలాగ్ ని ఈ సినిమాలో పెట్టారు. అది కావాలనే జగన్ ని ఉద్దేసించి పెట్టారని అంటుననారు. పొలిటికల్ అర్థాలు వెతుక్కుని మరీ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఆ డైలాగు ఇలా సాగుతుంది.
‘‘ప్రతి శుక్రవారం స్టేషన్ కు రావడం, సంతకం పెట్టడం ఖర్చు ఎక్కువవుతుంది. డబ్బు వేస్ట్ అవుతుంది’’ అనే డైలాగు జగన్ ని ఉద్దేశించే అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇదే సన్నివేశంలో పవన్ కల్యాణ్ ‘సరే రిజిస్టర్ పంపిస్తా.. తీరిగ్గా సంతకాలు పెట్టి పంపించు’ అని చెప్పడం.. ‘ఇంకా శ్రమ తగ్గాలనుకుంటే అదీ కూడా అవసరం లేదు. కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పంపిస్తా. తీరిగ్గా జైల్లో ఉండచ్చు’ అని చెప్పడం జగన్ ను టీజ్ చేయడానికే పెట్టినట్లుగా ఉందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ...‘బెదిరించాలంటే వార్నింగ్ ఇస్తా...
కొట్టాలంటే కొడతా..’’‘‘నేరస్తుల తల బరువుగా ఉంటుంది అందుకే దించుకుని ఉండాలి...
సైనికుల తల పొగరుతో ఉంటుంది.. అందుకే ఎత్తుకుని ఉంటుంది.."
ఇక ‘‘తొక్కితే మొలుస్తా...
దింపితే లెగుస్తాఆపలేని యుద్థం ఇస్తా’’ అనే డైలాగు సైతం జగన్ ని ఉద్ధేశించే అని చెప్తున్నారు.