Pawan Kalyan,Sai Tej multi starrer: మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న మెగా మామా అల్లుడు..

Published : Feb 06, 2022, 07:55 AM IST
Pawan Kalyan,Sai Tej multi starrer: మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న మెగా మామా అల్లుడు..

సారాంశం

టాలీవుడ్ లో రీమేక్ సినిమాల పరపరా కొనసాగుతుంది. కొనసాడం అని అడగం కంటే.. పెరిగింది అని అనడం బాగుంటుందేమో.. ఈమధ్య రీమేక్ ల జోరు ఇంకా పెరిగింది.

టాలీవుడ్ లో రీమేక్ సినిమాల పరపరా కొనసాగుతుంది. కొనసాడం అని అడగం కంటే.. పెరిగింది అని అనడం బాగుంటుందేమో.. ఈమధ్య రీమేక్ ల జోరు ఇంకా పెరిగింది.

టాలీవుడ్  లో రీమేక్ కింగ్ అంటే విక్టరీ వెంకటేష్(Venkatesh) పేరు మాత్రమే వినిపిస్తుంది. అంతే కాదు  ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమా అంటే కూడా వెంకీనే గుర్తుకు వస్తాడు. కాని ఇపుడు రీమేక్ లు.. మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ ను మరో సినిమా ప్యామిలీ కూడా ఫాలో అవుతున్నారు. మెగా ఫ్యామిలీ ఈ మధ్య ఎక్కువ రీమేక్ సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. రీమేక్ కమ్ మల్టీస్టారర్ చేయడానికి మెగామామా అల్లుడు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan).. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళ రీమేక్ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా తమిళంలో హిట్ కొట్టిన మరో కథ తెలుగుకు రానున్నట్టుగా తెలుస్తోంది .. వినోదాయ సితం అనే తమిళ సినిమా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అక్కడి సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాకి ఫేమస్ స్టార్  సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయనే ప్రధాన పాత్రను పోషించాడు.
ఇక రీసెంట్ గా సముద్రఖని(Samuthirakani)  ఈ కథను పవన్ కి వినిపించాడట .. అంతే కాదు తమిళ సినిమాను కూడా చూపించాడ. సినిమా చూసిన పవర్ స్టార్(Pawan Kalyan) బాగుందని తెలుగు లో చేస్తే ఇంకా బాగుంటుందని అన్నట్టు తెలుస్తోంది. అది కూడ సముద్రఖని(Samuthirakani) డైరెక్షన్ లోనే ఈ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపిస్తున్నారనే టాక్ వచ్చింది.

అంతే కాదు పవన్ కళ్యాన్ (Pawan Kalyan) తో పాటు మరో ముఖ్యమైన పాత్రను సుప్రీమ్ హీరో  సాయితేజ్  ఈ సినిమాలో చేయబోతున్నట్టు సమాచారం. వరుస ఫేయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు ఒక  మంచి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని మరో వాదన కూడా వినిపిస్తుంది.

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేసిన అల్లు అర్జున్ ? ఐకాన్ స్టార్ మాస్టర్ ప్లాన్ మూమూలుగా లేదుగా?
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్