Ram Charan : బన్ని హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్

By Mahesh Jujjuri  |  First Published Feb 6, 2022, 7:00 AM IST

టాలీవుడ్ లో  హీరోయిన్లుగా స్టార్ ఇమేజ్ కోసంచాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాని ఆ లక్ కొంత మందినే వరిస్తుంది. వారిలోముందు వరుసలో ఉంటుంది రష్మిక మందన్న(Rashmika Mandanna ).


టాలీవుడ్ లో  హీరోయిన్లుగా స్టార్ ఇమేజ్ కోసంచాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాని ఆ లక్ కొంత మందినే వరిస్తుంది. వారిలోముందు వరుసలో ఉంటుంది రష్మిక మందన్న(Rashmika Mandanna ).

 అందం..అభినయంతో పాటు అదృష్టం కూడా కలగలిసి ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna ). ఛలో సినిమాతో  ఏమంటా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో కాని వరుస సినిమాలతో .. వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది రష్మిక. కన్నడలో కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో పాతుకుపోయే పనిలో ఉంది.
రీసెంట్ గా పుష్ప(Pushpa) సినిమాతో రెచ్చిపోయింది రష్మిక. అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ఆయనకు ధీటుగా.. పోటీగా నటించి మెప్పించింది. తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తైయితే.. చిత్తూరు స్లాంగ్ ను నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకోవడం కూడా రష్మిక కెరీర్ కు బాగా ప్లాస్ అయ్యింది. పుష్ప తరువాత ఎన్నో అవకాశాలు ఆమెను వరిస్తూ..చుట్టు ముడుతున్నాయి. పుష్పలో అల్లు అర్జున్ తో కలిసి అలరించిన రష్మిక(Rashmika Mandanna ).. త్వరలో రామ్ చరణ్ తో జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

 జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ (Ram Charan)  సినిమా చేయనున్నారు. ఈమూవీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో చరణ్ జోడీగా రష్మికను తీసుకున్నారని తెలుస్తోంది. పుష్ప(Pushpa) మ్యానియాతో దేశం అంతా రష్మిక వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకూ చరణ్ తో రష్మిక సినిమా చేయలేదు. దాంతో ఆమె కూడా ఈ ఆఫర్ ను కాదనలేకపోయిందని తెలుస్తోంది. మెగాస్టార్ తనయుడితో సినిమా అంటే అది ఊహించని ఆఫర్ గా ఆమె ఫుల్ ఖుషిగా ఉన్నట్టు సమాచారం.

ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానీని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిణామాల ప్రకారం తాజాగా రష్మిక (Rashmika Mandanna )ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. బాలీవుడ్ వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న రష్మిక ప్రస్తుతం ఆ పనిమీదనే ఉంది. అటు బాలీవుడ్ లో ప్రయత్నం చేస్తూనే.. ఇటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఒప్పుకుంటుంది.  ప్రస్తుతం రష్మిక (Rashmika Mandanna )పుష్ప 2 షూటింగుకి రెడీ అవుతుంది..దీనితో పాటు రామ్ చరణ్ సినిమాకు కూడా డేట్స్ ను ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

click me!