
నిజాన్ని అబద్ధంతో కవర్ చేయవచ్చు... కానీ చరిత్రను చేయలేము. అందరికీ తెలిసిన గత విషయాలను మార్చి చెబితే ఈ జనరేషన్ నమ్మేస్తుందేమో. దాన్ని ప్రత్యక్షంగా చూసిన జనాలు నవ్వుకుంటారు . బాలయ్య టాక్ షోకి గెస్ట్ గా వచ్చిన మహేష్ మాటలు అలాగే అప్పటి తరానికి నవ్వు తెప్పించాయి. కృష్ణతో ఎన్టీఆర్ (NTR)కి వివాదం గురించి బాలయ్య మహేష్ ని అడిగారు. అదంతా అబద్ధం అనేశారు మహేష్.
సీతారామరాజు మూవీ విషయంలో ఎన్టీఆర్, కృష్ణ(Krishna) కి గొడవైందని... ఆ వైరం దశాబ్దాల పాటు సాగిందనేది నిజం. 1974లో అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై అఖండ విజయం సాధించండి. ఆ పాత్రపై అమితమైన ప్రేమ కలిగిన ఎన్టీఆర్ మూవీ చేయొద్దని కృష్ణను కోరారు. అప్పటికే రంగం సిద్ధం చేసుకున్న కృష్ణ వెనక్కి తగ్గలేదు. ఇది ఎన్టీఆర్ అహాన్ని దెబ్బతీసింది. తిరుగులేని స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ కృష్ణను ఇబ్బందులకు గురిచేశారు.
ఇది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ పై కోపాన్ని కృష్ణ సినిమాల రూపంలో చూపించారు. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ దెబ్బతీసేలా ప్రత్యేకంగా సినిమాలు నిర్మించారు. మండలాధీశుడు, గండిపేట రహస్యం చిత్రాలు ఎన్టీఆర్ లోగుట్టు బట్టబయలు చేసేలా తెరకెక్కాయి. సదరు చిత్రాలపై ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకత చూపించారు . మండలాధీశుడు సినిమాలో మెయిన్ రోల్ చేసిన కోటా శ్రీనివాసరావుపై అభిమానులు దాడి చేయబోయారు.
ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి సీఎం అయ్యారు . పరిశ్రమలో ఎన్టీఆర్ సామాజిక వర్గం వారు ఆయన పక్కన చేరి పదవులు, ప్రయోజనాలు పొందారు . కృష్ణ కూడా ఎన్టీఆర్ సామాజిక వర్గమే అయినా ఆ పార్టీ వైవు కన్నెత్తి చూడలేదు. పైగా ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా ఉన్నారు. ఎన్టీఆర్-కృష్ణ మధ్య చాలా పెద్ద రభసే జరిగింది. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా నందమూరి-ఘట్టమనేని కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడలేదు.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొన్నాళ్లుగా మహేష్ (Mahesh babu)తో స్నేహం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. కాగా ఎన్టీఆర్-కృష్ణ గొడవ టీవీ సీరియల్ మాదిరి ఏళ్ళపాటు సాగింది. ఇవన్నీ జనాలు మర్చిపోయారనుకున్నారేమో మహేష్... అంతా ట్రాష్, అల్లూరి సీతారామరాజు మూవీ అద్భుతమని ఎన్టీఆర్ నాన్నను పొగిడారని అన్నారు.
బాలయ్య షోలో అంతా ఓపెన్ అనుకుంటే పొరపాటే. ఇలాంటి కవరింగ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. బాలయ్య, మహేష్ ముందుగానే ఈ ప్రశ్న, దానికి సంబంధించిన ఆన్సర్ గురించి చర్చించుకొని ప్రేక్షకులకు కొత్త కథ చెప్పారు. సరే అదంతా ముగిసిన అధ్యాయం కాబట్టి... మనం కూడా మర్చిపోయినట్లు నటిస్తే బెటర్.