పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘బ్రో ది అవతార్’. ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా డబ్బింగ్ ను కూడా ప్రారంభించినట్టు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Bro The Avatar. తమిళ స్టార్ నటుడు, డైరెక్టర్ సుముద్రఖని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూట్ కు హాజరయ్యారు. ఇక తాజాగా సాయిధరమ్ తేజ్, ఇతర తారాగణంతోనూ షూటింగ్ ముగిసినట్టు తెలుస్తోంది. దీంతో తదుపరి ప్రొడక్షన్ పనులపై మేకర్స్ దృష్టి పెట్టారు.
ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమా నుంచి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. రీసెంట్ గా వచ్చిన ద్వయం పోస్టర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
ఈరోజు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ ను కూడా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా యూనిట్ రివీల్ చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమకు కావాల్సినవి ఇలాంటి అప్డేట్స్ కాదని, టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని చెప్పాంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే హీరోయిన్లను కూడా అఫీషియల్ గా మెన్షన్ చేయకపోవడం పట్ల కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఇక ఇప్పటి నుంచి డబ్బింగ్ తో పాటు మిగితా నిర్మాణ పనులు కూడా చకాచకా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. రిలీజ్ కు మరో 45 రెండు నెలల సమయం ఉండటంతో వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ప్రమోషన్ లో దిగనున్నారని అంటున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. బ్రో' సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Dubbing works for commences with a Pooja Ceremony today 🥳
Worldwide Release on July 28th 💥 … pic.twitter.com/UYCalAhaCT