అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ విడుదల.. డిటేయిల్స్

By Asianet NewsFirst Published May 30, 2023, 7:01 PM IST
Highlights

హీరో అల్లు శిరీష్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బడ్డీ’ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ గ్లింప్స్  విడుదలై ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish)  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా విభిన్న కథలతో థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నారు. నీట్ కంటెంట్ తో ఆడియెన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంలో మంచి హిట్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బడ్డీ’ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ గ్లింప్స్  విడుదలై ఆకట్టుకుంటోంది. 
 
ప్రతిష్టాత్మక స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో అల్లు శిరీష్ హీరోగా రాబోయే చిత్రమే Buddy. ఈరోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్ప్స్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇంకా గ్లిమ్ప్స్ వీడియో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను రేకెత్తిస్తుంది. 2:37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో లో టెడ్డి ను చంపే ప్రయత్నం చేసే ఒక బ్యాచ్ , టెడ్డీని సంరక్షించే పాత్రలో శిరీష్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్  అదిరిపోయాయి.

ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తుండగా.. గ్లింప్స్  ద్వారా తనదైన స్టైల్ ను చూపించే ప్రయత్నం చేశారు. ఇక శిరీష్ ఇంటెన్స్ లుక్ తో ఈ వీడియో లో కనిపించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా బాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమాకు ఇది మెయిన్ ప్లస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూబెన్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి. 

 

Meet the birthday boy and his 🧸

Buckle up for an action packed ride 💥

The Glimpse - https://t.co/pu1vjrQVcs

Happy Birthday ❤️‍🔥 … pic.twitter.com/Z94bTyvG60

— Studio Green (@StudioGreen2)
click me!